Coffee : కాఫీ ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఒక్కసారి ఇది చదవండి..!
Coffee : ప్రస్తుతం మానవ జీవితం ఉరుకులు, పరుగులుగా మారిపోయింది. పనులు, ఒత్తిడులు, బాధ్యతలు ఇలా అనేక అంశాలపై చాలా సమస్యలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి ఒత్తిడుల నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. మరి కొందరు వీటికి బానిసలవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇక కొందరికి ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే డే స్టార్ట్ అవ్వదు. ఇలా కాఫీ తాగే వారు ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి.
ఉదయాన్ని పడిగడుపున కాఫీ తాగితే అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇలాంటి అలవాటు ఉన్న వారు దీనిని వెంటనే మానుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఉదయాన్ని లేవగానే తాగడం వల్ల నిద్రలేమితో పాటు మానసిక ప్రశాంతతకు ఆటంకం కలుగుతుంది. కాఫీ తాగడం వల్ల కడుపునొప్పి, వాంతులు, రక్తపోటు, వంటి సమస్యలు ఎదురవుతాయి. కాఫీని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఆందోళన, తలనొప్పి వంటివి పెరుగుతుతాయి. ఇవి గుండెపోటుకు సైతం కారణమయ్యే చాన్స్ ఉంది.
Coffee : కారణం ఏంటంటే..?
రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ తాగితే మెదడుకు సంబంధించిన వ్యాదులు, ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల జీవక్రియ, శారీరక పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది. ఇది గ్యాస్ట్రిన్ విడుదలకు కారణం అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల కలిగే ఉద్దీపన ప్రభావాలు గండె వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదముంది. మరి ఎక్కువగా కాఫీ తాగే వారు ఇలాంటి విషయాలు గుర్తుంచుకుని కాఫీని పరిమితంగా తాగడం మంచిది. లేదంటే సమస్యలను కాఫీ రూపంలో తెచ్చుకున్నట్టే అవుతుంది.