Health Benefits : ఈ ఒక్క జ్యూస్ తాగితే ఎటువంటి రోగాలు దరిచేరవు తెలుసా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ ఒక్క జ్యూస్ తాగితే ఎటువంటి రోగాలు దరిచేరవు తెలుసా ..?

 Authored By prabhas | The Telugu News | Updated on :4 April 2023,7:00 pm

Health Benefits : బూడిద గుమ్మడికాయ వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఎంత ఖరీదైన కారు కొన్న దిష్టి తీయటానికి బూడిద గుమ్మడికాయ చాలా అవసరం. ఇంటికి దిష్టి పోవడానికి కూడా బూడిద గుమ్మడికాయనే వాడతారు. అలాంటి బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బూడిద గుమ్మడికాయ ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన అధిక బరువు సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్, సాలాడ్స్, కూరలా కూడా చేసుకొని తినవచ్చు.

Amazing Health Benefits of Ash Gourd Juice and Gummadikara Juice

Amazing Health Benefits of Ash Gourd Juice and Gummadikara Juice

బూడిద గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో కడుపులో మంట, మలబద్ధకం సమస్యలు పోతాయి. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన డిహైడ్రేషన్ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో విష పదార్థాలను తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్, ఖనిజాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు అనేవి రావు. వీటి గింజల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వీటిని వివిధ రకాల మెడిసిన్స్ లలో వాడుతారు.

Ash Gourd Juice | Weight Loss | Winter Melon Juice | Poosanikkai Juice |  Diabetic Recipe - YouTube

బూడిద గుమ్మడికాయను కూరగా చేసుకోవడం ఇష్టం లేనివారు జ్యూస్ గా చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలు, అధిక బరువు సమస్యలను దూరం చేస్తుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా తయారయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ జ్యూస్ వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఆందోళన ఒత్తిడితో బాధపడేవారు ఈ జ్యూస్ ని ప్రతిరోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ జ్యూస్ని తాగితే మంచిది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది