Health Benefits : క్యాబేజీ వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. అస్సలే వదిలిపెట్టరు!
Health Benefits : మనం తీసుకునే ఆహారంలో కూరగాయల పాత్ర వెలకట్టలేనిది. తాజా కూరగాయలు అందించే ఆరోగ్య ప్రయోజనాల వల్లే మనం ఆరోగ్యంగా ఉండగల్గుతున్నాం. అయితే ముఖ్యంగా క్యాబేజీ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా మందికి క్యాబేజీ అంటేనే ఇష్టం ఉండదు. అందుకే నెలలో ఒక్కసారి కూడా దీన్ని తినేందుకు ఇష్ట పడరు. అయితే క్యాబేజీలో విటామిన్ ఎ, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటి ఇతర రకాల సూక్ష్మ పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. […]
Health Benefits : మనం తీసుకునే ఆహారంలో కూరగాయల పాత్ర వెలకట్టలేనిది. తాజా కూరగాయలు అందించే ఆరోగ్య ప్రయోజనాల వల్లే మనం ఆరోగ్యంగా ఉండగల్గుతున్నాం. అయితే ముఖ్యంగా క్యాబేజీ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా మందికి క్యాబేజీ అంటేనే ఇష్టం ఉండదు. అందుకే నెలలో ఒక్కసారి కూడా దీన్ని తినేందుకు ఇష్ట పడరు. అయితే క్యాబేజీలో విటామిన్ ఎ, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటి ఇతర రకాల సూక్ష్మ పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అంతే కాకుండా విటామిన్ బి6 మరియు ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండూ శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలకు అవసరం. వీటిలో శక్తి జీవక్రియ మరియు నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పని తీరును మెరుగుపరుస్తుంది.
క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే పాలీపెనాల్స్ మరియు సల్పర్ సమ్మేలనాలతో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కల్గి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే ఇందులో విటామిన్ సి, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, దృష్టి లోపం ఉన్న వారికి చాలా మంచిది. దీర్ఘకాళిక గుండె జబ్బులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధితో సహా అనేక వ్యాధులను అదుపులో ఉంచుతుంది. అలాగే క్యాబేజీలోని సల్ఫోరాపేన్, కెంప్ఫెరోల్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. విటామిన్ సి ని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటామిన్. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
ఎముకలు, కండరాలు మరియు రక్త నాళాల సరైన పని తీరును కీలకమైన కొల్లాజెన్ తయారీలో సి విటామిన్ ఉపయోగపడుతుంది. అదనంగా విటామిన్ సి శరీరంలోని ఆహారంలో లభించే ఐరన్ గ్రహించడానికి శరీరానికి సహకరిస్తుంది. క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించడంలో దోహదం చేస్తుంది.జీర్ణశక్తిని మెరుగు పరుచుకోవాలంటే ఫైబర్ అధికంగా ఉండే క్యాబేజీని తినడం శ్రేయస్కరం. ఇందులో కార్బోహైడ్రేట్ లు, పీచు పదార్థాలు ప్రేగు కదలికలను ఆరోగ్య వంతంగా ఉంచుతుంది. అలాగే ఎర్ర క్యాబేజీలో ఉండే ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు… గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం ఒఖ ముఖ్యమైన ఖనిజ మరియు ఎలక్ట్రోలైట్. ఇది శరీరం సరిగ్గా పని చేయడానికి దోహదం చేస్తుంది. పొటాషియం మూత్రం ద్వారా అదనపు సోడియం విసర్జించడానికి సాయపడుతుంది. క్యాబేజీ తినడం వల్ల సూపర్ హెల్తీగా ఉండటనే కాకుండా రుచిని కూడా తినొచ్చు.