Health Benefits : ఇది పళ్లకు రాశారంటే.. మటన్ బొక్కలు కూడా తుక్కు తుక్కు నమలొచ్చు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఇది పళ్లకు రాశారంటే.. మటన్ బొక్కలు కూడా తుక్కు తుక్కు నమలొచ్చు!

 Authored By pavan | The Telugu News | Updated on :29 April 2022,1:00 pm

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ అందానికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. అందరి ముందు బాగా కనిపించేందుకు ఎన్నెన్నో మేకప్ లు వంటివి వాడుతున్నారు. అయితే అందులోనూ ముఖ్యం మరింత అందంగా కనిపించేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే పళ్లు తెల్లగా మిలమిలా మెరిసేందుకు రకారకాల పేస్టులను ఉపయోగిస్తున్నారు. నవ్వినప్పుడు, మాట్లాడేటప్పుడు మన అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసేది దంతాలే. అందుకే వాటి అందానికి, ఆరోగ్యానికి అంత ప్రాముఖ్యత. అయితే ప్రతిరోజూ ఉదయం లేవగానే మనం బ్రష్ చేసుకుంటాం. కొందరు కనీసం అరగంట సేపు పళ్లు అరిగిపోయేలా తోముతుంటారు. మరికొందరేమో అయిదే అయిదు నిమిషాలు బర్ర బర్ర రాకి.. పళ్లను అరగదీస్తారు.

కానీ ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. ఇందుకోసం ఇంట్లో ఉండే తేనెను ఉపయోగించి పళ్లను అందంగా ఆరోగ్యంగా చేసుకోవచ్చని సూచిస్తున్నారు.అయితే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల ఒరిజినల్ తేనెను నోట్లో వేసుకుని బాగా చప్పరించాలి. పుక్కిలించకుండాను మింగేయాలి. తేనెలో ఉండే యాంటీ బయాటిక్ కారమంగా నోటిలో పెరిగే బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. కావున నోటిలో పాచి పేరుకోవడం తగ్గుతుంది. అలాగే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ తేనెను డయాబెటిస్ పేషెంట్స్ కడా ఉపయోగించవచ్చు. దీని వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వేడి చెయ్యని తేనెలో మాత్రమే ఈ యాంటీ బయోటిక్ స్వభావం ఉంటుంది. కాబట్టి ముడి తేనెను మాత్రమే మీరు వినియోగించాల్సి ఉంటుంది.

Amazing Health Benefits of Strong Teeth and avoid teeth cavity

Amazing Health Benefits of Strong Teeth and avoid teeth cavity

అప్పుడే దంతాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా పుప్పళ్లు, పళ్లు పుచ్చిపోవడం వంటి సమస్యలను దరి చేరనివ్వదు. ఈ మధ్య కాలంలో చాలా మంది దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ వ్యాప్త లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందిలో మూడు వందల మందికి దంత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటన్నిటికి చెక్ పెట్టాలంటే వైద్యుల వద్దకు వెళ్లడం ఒకటే పరిష్కారం కాదు.. తేనెను వాడడం కూడా మంచిదే. అందుకే ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన తేనెను రాత్రి పుడుకునే ముందు నోట్లో వేసుకొని పడుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అంతే కాకుండా పళ్లు ఆరోగ్యంగా, అందంగా తయారవుతాయి. నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాన్పిడెంట్ గా ఉండేలా చేస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది