Health Benifits : ఈ గింజలు తిన్నారంటే.. పదే పది సెకన్లలో కాలేయమంతా క్లీన్ అయిపోతుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benifits : ఈ గింజలు తిన్నారంటే.. పదే పది సెకన్లలో కాలేయమంతా క్లీన్ అయిపోతుంది!

 Authored By pavan | The Telugu News | Updated on :28 April 2022,6:00 pm

Health Benifits : చిక్కుడు కాయలు చలి కాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇవి పెద్ద పెద్ద గింజలను కల్గి రుచిగా కూడా ఉంటాయి. కానీ వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొంత మంది వీటిని తినడానికి ఇష్టపడరు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజాలు అందుతాయి. ముఖ్యంగా వీటిలో ఉండే కాల్షియమ్, మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్, ఫోలిక్ ఆసిడ్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని రోజూ ఉడికించుకొని లేదా కూర వండుకొని తినడం వల్ల ఎముకలు దృఢఁగా అవుతాయి.అధికంగా ఉన్న బరువును తగ్గించాలనుకునే వారికి చిక్కుడు కాయలు అమృతమనే చెప్పాలి. చిక్కుడు కాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో ఎంతో ఉపయోగపడతాయి.100 గ్రాముల చిక్కుడు గింజల్లో 300 లకు పైగా నీరే ఉంటుంది.

చిక్కుడు కాయలు తింటే శరీరానికి కావాల్సిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే శక్తి సామరథ్యాన్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. చిక్కుడు కాయలు క్యాన్సర్ కారకాలను కూడా తగ్గించడానికి సాయం చేస్తాయి. బరువు తగ్గాలని శ్రమించే వారు ఆహారంలో చిక్కుడు కాయలను భాగం చేసుకోవాలి. నిత్యం తీసుకునే ఆహారంలో చిక్కుడు గింజలు తినడం ఎంతో ప్రయోజనం ఉంటుంది. చిక్కుడులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. క్యాల్షియం కూడా అధికంగా ఉండటం వల్ల ఎముకలు ధృడంగా తయారు అవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా పని చేస్తాయి చిక్కుడులో ఉండే పోషకాలు. గర్భిణీలు, బాలింతలు, వ్యాయామం చేసే వాళ్లు చిక్కుడు గింజలు తీసుకోవడం చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఎండిన చిక్కుడు గింజలను కూరల్లో వేసుకుంటే పచ్చి గింజలతో వచ్చే ప్రయోజనమే వస్తుంది.

amazing health benifits of beans to clean liver

amazing health benifits of beans to clean liver

చిక్కుడు కాయలను ఆహారంలో భాగం చేసుకుని తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఆకలి త్వరగా వేయదు. ఆకలి వేయకపోతే ఆహార పదార్థాలు తినబోము. దాంతో అధిక బరువు పెరిగే అవకాశాలు ఏమాత్రం ఉండవు.చిక్కుడు గింజల్లో ఉండే పీచు పదార్థాలు జీర్ణ క్రియను మెరుగు పరచడం మాత్రమే కాకుండా పేగు క్యాన్సర్ల నుండి కాపాడుతుంది. డయేరియా, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దూరంగా ఉంచుతుంది. చిక్కుడు గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యం కారణంగా వచ్చే వ్యాధుల నుండి రక్షిస్తాయి. చిక్కుడు కాయల్లో ఉండే మాగనీస్ నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. చిక్కుడు గింజల్లో విటమిన్లు గుండె ఆరోగ్యానని మెరుగుపరుస్తాయి. మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపరితిత్తుల సమస్యలను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలను నివారించడానికి దివ్యమైన ఔషధంలా పని చేస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది