Hands And Feet : అరికాళ్ళు, అరిచేతులు తరచూ చల్లబడుతున్నాయా…? అసలు ఎందుకు ఇలా అవుతుందో తెలుసా…?
ప్రస్తుత కాలంలో సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడడం కామన్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం కూడా చల్లబడుతుంది. కానీ ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ కొంతమందికి ఎల్లప్పుడూ పాదాలు, చేతులు చల్లగానే ఉంటాయి. ఇలా మాటిమాటికి చల్లబడితే అనారోగ్యానికి సంకేతం. అయితే మీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా… వెంటనే వైద్యుని సంప్రదించవలసి నిపుణులు చెబుతున్నారు. మనం చలిగా ఉన్న వాతావరణంలోకి వెళ్ళినప్పుడు. కానీ వాతావరణం చేత మన శరీరం ఒక్కసారిగా చేతులు, కాళ్లు చల్లబడటం జరుగుతుంది. తద్వారా కాళ్ళలలో రక్తప్రసరణ తగ్గిపోతుంది. అనంతరం కాసేపటికే ఒళ్ళు మళ్ళీ వేడెక్కిపోతుంది. ఇలా చల్లని వాతావరణ శరీరం భాగాలు వేడెక్కుతున్నాయి అంటే అది మంచి ఆరోగ్యమని అర్థం. అంత శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుందని అర్థం. కాని చేతులు, కాళ్లు విపరీతంగా చల్లబడి, మంచులా చల్లగా మారితే శరీరంలో పలు పోషకాలు నిర్దిష్ట లోపానికి సంకేతం అని అర్థం. అసలు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాళ్లు చేతులు ఎందుకు చల్లగా మారుతాయి ఇక్కడ తెలుసుకుందాం.
Hands And Feet చల్లని పాదాలకు కారణాలు
ముఖ్యంగా చేతులు, కాళ్లు చల్లగా మారుతున్నాయి అంటే, వాటి వెనుక ఉన్న అతిపెద్ద కారణo ఒకటి వారి రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం. ఇది రక్తప్రసరణ తగ్గిస్తుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమవుతుంది. చల్లటి పాదాలకు మరో ప్రధాన కారణం రక్తప్రసరణ. రక్తప్రసరణ ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం. దీనివల్ల రక్తప్రసరణ తగ్గి పాదాలు చల్లగా మారుతాయి. అంతేకాకుండా కాళ్లు, చేతులు ఎల్లప్పుడూ చల్లగా మారితే కొన్ని రకాల వ్యాధులు దాడి చేస్తాయి.
రక్తహీనత : శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గినప్పుడు పాదాలు, చేతులు చల్లగా మారుతాయి. రక్తహీనతతో బాధపడేవారు శరీరానికి అవసరమైన రక్తం లేకపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. రక్తం తక్కువగా ఉండడం వలన పాదాలు చల్లబడడం ప్రారంభిస్తాయి. అలాగే బి12, ఫో లేట్ , ఐరన్ లోపం కారణంగా కూడా పాదాలు చల్లగా మారే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా మూత్రపిండ వ్యాధి కారణంగా కూడా పాదాలు చల్లబడతాయి.
మధుమేహం : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీ పాదాలు చల్లగా మారితే మీ రక్తంలో చక్కెరలు సాయి పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు శరీరంలో ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్
లు పెరగటం లేదా తగ్గటం వల్ల వారి పాదాలు చల్లగా మారుతాయి.
నరాల సమస్య : చల్లని పాదాలు ఉన్నవారికి నరాల సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. ఒత్తిడి, ఏదైనా ఇతర ప్రమాదాలు కారణంగా నరాల సమస్యలు సంభవిస్తాయి. కావున నరాల బలహీనత ఏర్పడవచ్చు. బలహీనత ఉన్నవారికి త్వరగా పాదాలు,చేతులు చల్లబడే అవకాశం ఉంది.