Winter Tips : మీరు చలికాలంలో వీటిని తింటున్నారా.? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Winter Tips : మీరు చలికాలంలో వీటిని తింటున్నారా.? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్లే…!

Winter Tips : చాలామంది చలికాలంలో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకుంటూనే ఉంటారు. అయితే ఈ శీతాకాలంలో తీసుకొని కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. అలాంటివి ఈ చలికాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం డేంజర్ లో పడుతుంది. చలికాలం వచ్చిందంటే మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను నూనెలో వేయించిన వంటకాలు లేదా వేడివేడి కాఫీ ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ శీతాకాలంలో నోటిని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 December 2022,7:00 am

Winter Tips : చాలామంది చలికాలంలో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకుంటూనే ఉంటారు. అయితే ఈ శీతాకాలంలో తీసుకొని కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. అలాంటివి ఈ చలికాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం డేంజర్ లో పడుతుంది. చలికాలం వచ్చిందంటే మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను నూనెలో వేయించిన వంటకాలు లేదా వేడివేడి కాఫీ ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ శీతాకాలంలో నోటిని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడడం ఖాయం.

ముఖ్యంగా చలికాలంలో ఆహార పదార్థాల పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రదానం ఎందుకనగా ఈ శీతాకాలంలో కొన్ని ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది చలికాలంలోనూ వర్షాకాలంలో శీతల పానీయాలు, ఐస్ క్రీములు చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం బాగా అలవాటు ఉంటుంది. కాబట్టి ప్లూ, జలుబు లాంటి సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. కావున ఇటువంటి పరిస్థితుల్లో ఫిట్ గా ఉండేందుకు ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవాలి. దానికి ఈ చలికాలంలో అతి వేడి అతి చల్లని ఆహార పదార్థాలను ముట్ట వద్దని చెప్తున్నారు. ఆరోగ్య నిపుణులు అయితే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…

Are you eating these in winter

Are you eating these in winter

సలాడ్లు : సలాడ్లతోపాటు పచ్చి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన శీతాకాలంలో దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలంలో సలాడ్లను తీసుకోకపోవడమే మంచిది.

రెడ్ మీట్ : శీతాకాలంలో రెడ్ మీట్ తీసుకోకూడదు. ఎందుకనగా ఈ మాంసంలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి వీటి వలన గొంతులో కఫం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావున ఈ శీతాకాలంలో రెడ్ మీట్ కి దూరంగా ఉండటమే మంచిది.

పాల పదార్థాలు : ఈ శీతాకాలంలో పాల ఉత్పత్తులు వాడకానికి దూరంగా ఉండటమే చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వలన మీకు ఇన్ఫెక్షన్స్ తో పాటు చాతిలో కొరకు కారణం అవచ్చు. కాబట్టి చలికాలంలో షేక్స్ స్మూతీసు లాంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే చాలా శ్రేయస్కరం వీటిని తీసుకోవడం వల్ల దగ్గు సమస్య అధికమవుతుంది.

ఈ జ్యూసులకు దూరంగా ఉండాలి… చలికాలంలో ప్యాక్ చేసిన జ్యూసులను అస్సలు తీసుకోవద్దు. వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యం దెబ్బతింటుంది. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది