Cooking Oil : గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెడుతున్నారా…ఎంత ప్రమాదమో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cooking Oil : గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెడుతున్నారా…ఎంత ప్రమాదమో తెలుసా…!!

Cooking Oil : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెడితే ప్రమాదం అని అంటున్నారు. ఇదేమిటి ఆరోగ్యానికి, గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెట్టడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా. సంబంధం ఉంది. సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో నూనె ఒకటి. వంటలలో దీని అవసరం ఎక్కువ కావున స్టవ్ దగ్గర్లోనే […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 June 2024,7:00 am

Cooking Oil : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెడితే ప్రమాదం అని అంటున్నారు. ఇదేమిటి ఆరోగ్యానికి, గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెట్టడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా. సంబంధం ఉంది. సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో నూనె ఒకటి. వంటలలో దీని అవసరం ఎక్కువ కావున స్టవ్ దగ్గర్లోనే పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరం అని అధ్యయనంలో తేలింది.

ఇలా చేయడం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరిస్తున్నారు… వివరాల్లోకెళితే : గ్యాస్ స్టవ్ పక్కనే నూనెను ఉంచటం వలన ఆ వేడికి నూనెలు ఆక్సికరణ ప్రక్రియ అనేది ఎంతో వేగవంతం అవుతుంది. సాధారణంగా నూనెలో కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. నూనె భద్రపరిచి సీసాను గాని, లేకుంటే ప్యాకెట్లు కానీ తెరిచిన వెంటనే అందులోని కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి అనేది మారుతుంది. దుర్వాసన కూడా వస్తుంది.

Cooking Oil గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెడుతున్నారాఎంత ప్రమాదమో తెలుసా

Cooking Oil : గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెడుతున్నారా…ఎంత ప్రమాదమో తెలుసా…!!

ఈ నూనెను వాడటం వలన వృద్ధాప్యం అనేది వేగవంతం అవటమే కాక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఎంతో వేగంగా పెరిగి ఊబకాయం, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే నూనెను తీసుకొచ్చిన వాటిలోనే ఉంచాలి…గాలి వెలుతురు చొర పడకుండా గట్టిగా మూత పెట్టుకోవాలి. వెజిటేబుల్ ఆయిల్స్ ను చల్లగా ఉండే, వెలుతురు సోకని చోట ఉంచుకోవాలి. మొదట తెరిచిన తరువాత 3 నుండి 6 నెలల లోపు వాటిని ఉపయోగించాలి. వాల్ నట్ హెజెల్ నట్, అల్మాండ్ నూనెలను మాత్రం ఫ్రిజ్ లో భద్రపరచడం మంచిది అని అంటున్నారు నిపుణులు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది