Soaked Raisin Water : నానబెట్టిన ఎండుద్రాక్ష నీరు పారబోస్తున్నారా.. ఇది తెలిస్తే ఆ పని చేయరు..!
ప్రధానాంశాలు:
Soaked Raisin Water : నానబెట్టిన ఎండుద్రాక్ష నీరు పారబోస్తున్నారా.. ఇది తెలిస్తే ఆ పని చేయరు..!
Soaked Raisin Water : మన బాడీకి డ్రై ఫ్రూట్స్ ఎంతో శక్తిని ఇస్తాయి. మామూలు పండ్లకన్నా డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి మనల్ని. అయితే ఈ కాలంలో చాలా మంది ఉదయాన్నే నానబెట్టిన బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్ ను తింటుంటారు. ఇవి చాలా మేలును చేస్తాయి. కొందరు ఉదయాన్నే నానబెట్టిన ద్రాక్షను కూడా తింటుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొందరు ఆ ద్రాక్షను తిని వాటర్ ను పారబోస్తుంటారు. కానీ నానబెట్టిన నీటితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వాటిని అస్సలు పారబోయరు. ఎందుకంటే ఆ నీటితో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Soaked Raisin Water : జీర్ణాశయం ఆరోగ్యానికి..
ఇది డిటాక్స్ వాటర్ గా బాడీకి పని చేస్తుంది. మన బాడీలో ఎక్కడైనా పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపే మెడిసిన్ లాగా ఇది చురుగ్గా పని చేస్తుంది. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సాయం చేస్తుంది. ఇక ఈ నీటితో జీర్ణాశయం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఫైబర్ కంటెంట్ లాగా పని చేసి జీర్ణసంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది. ప్రేగుల కదలికలను చురుగ్గా ఉంచుతుంది. పైగా ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని సేఫ్ గా ఉంచడంలో సాయం చేస్తాయి.
ఈ నీటిని తాగడం వల్ల మరో లాభం కూడా ఉందండోయ్. అదేంటంటే ఇది బాడీకి బాగా శక్తిని ఇస్తుంది. అంతే కాకుండా బాడీలో మంట కూడా తగ్గుతుంది. ఈ వాటర్ లో ఉండే విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. దాంతో పాటు మరో ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే ఇది కాలేయ ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. ఇక అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఇది మంచి మెడిసిన్. ఎందుంకటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆకలిని తగ్గిస్తుంది. దాంతో సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
ఇక అధిక రక్తపోటు ఉన్న వారికి అయితే మంచిది. ఇందులో ఐరన్ ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో ఇది సాయం చేస్తుంది. అంతే కాకుండా మలబద్దక సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇన్ని లాభాల ఉన్నాయి కాబట్టి నానబెట్టిన ద్రాక్ష వాటర్ ను కచ్చితంగా తాగాలి.