Hair Tips : ఒకే ఒక్క ఆకుతో తెల్ల జుట్టు మాయం… అయితే ఇలా మాత్రం చేయకండి
Hair Tips : ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరిలో తెల్లజుట్టు సమస్యతో మొదలవుతోంది. ఈ సమస్య ప్రధానంగా కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఎండ తగలకపోవడం, తలకి కెమికల్స్ వాడటం వల్ల వస్తుంది. అయితే తెల్ల జుట్టు కనపడగానే చాలా మంది హెయిర్ క్రీమ్ వాడుతున్నారు. రకరకాల అయిల్స్, షాంపోలు వాడుతున్నారు. దీంతో చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. కాగా దీని వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే నేచురల్ గా తెల్ల జుట్టు నల్లగా మారేందుకు పాటించాల్సిన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అలాగే ఉసిరి నూనె వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ ను అందిస్తుంది. దాని వల్ల.. జుట్టు ఊడటం తగ్గిపోయి.. జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు నల్లగా మారుతుంది. విటమిన్ ఈ జుట్టు కుదుళ్లు ధృడంగా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే.. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే.. జుట్టు ధృడంగా తయారు అవ్వడంతో పాటు నల్లగా మారుతుంది.తులసి ఆకులు, జామ కాయ లేదా దాని ఆకుల రసాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత భృంగరాజ్ (ఫాల్స్ డైసీ) ఆకుల రసాన్ని సమాన పరిమాణంలో తీసుకొని.. మూడింటిని మిక్స్ చేయాలి. ఆ తర్వాత జుట్టుకు మిశ్రమాన్ని బాగా పట్టించి..

follow these 3 tips to turn white hair to black hair
White Hair : ఇవి ట్రై చేసి చూడండి..
కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.కరివేపాకులో బయో యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి. కరివేపాకు వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది. కరివేపాకు పేస్ట్ లేదా కరివేపాకు వేసిన నూనెను తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టును తగ్గిస్తుంది.నిమ్మకాయలో ఉండే మూలకాలు జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. 15 ml నిమ్మరసం, 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకుని రెండింటిని కలిపి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యూలర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది.