Banana Flower : రోజువారి ఆహారంలో అరటి పువ్వును చేర్చుకోండి… ఎన్ని లాభాలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Banana Flower : రోజువారి ఆహారంలో అరటి పువ్వును చేర్చుకోండి… ఎన్ని లాభాలో…!

Banana Flower : అరటి పండు ఎంతో మందికి ఇష్టమైన పండు అని చెప్పొచ్చు. ఇది తినడానికి ఎంత రుచిగా ఉంటుందో దీనిలో పోషకాలు కూడా అంతే ఉంటాయి. కానీ ఈ అరటిపండు మాత్రమే కాదు అరటి పండు కంటే ముందు వచ్చే అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఈ అరటి పువ్వు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్స్ సి ఎ ఈ, పొటాషియం, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Banana Flower : రోజువారి ఆహారంలో అరటి పువ్వును చేర్చుకోండి... ఎన్ని లాభాలో...!

Banana Flower : అరటి పండు ఎంతో మందికి ఇష్టమైన పండు అని చెప్పొచ్చు. ఇది తినడానికి ఎంత రుచిగా ఉంటుందో దీనిలో పోషకాలు కూడా అంతే ఉంటాయి. కానీ ఈ అరటిపండు మాత్రమే కాదు అరటి పండు కంటే ముందు వచ్చే అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఈ అరటి పువ్వు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్స్ సి ఎ ఈ, పొటాషియం, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచడం దగ్గర నుండి ఇతర శారీరక సమస్యలను పరిష్కరించటం వరకు ఎన్నో రకాల సమస్యలకు ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. అయితే ఈ అరటి పువ్వులో పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుంది. దీని వలన ఇది రక్తపోటును తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటే గుండె సమస్యలు కూడా దూరం అవుతాయి…

ఈ అరటి పువ్వులో ఐరన్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఈ అరటి పువ్వు హిమోగ్లోబిన్ ను రూపొందించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. కావున రక్తహీనత సమస్యతో బాధపడేవారు మీరు ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఈ అరటి పువ్వును చేర్చుకోండి. ఈ వర్షాకాలం అంటేనే జలుబు మరియు ఫ్లూ సమస్యలు అధికమవుతాయి. అయితే ఈ సమస్యలన్నీటిని కూడా నియంత్రించడానికి ఈ అరటి పువ్వును కచ్చితంగా ప్రతిరోజు తీసుకుంటే చాలు. దీనిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది…

Banana Flower రోజువారి ఆహారంలో అరటి పువ్వును చేర్చుకోండి ఎన్ని లాభాలో

Banana Flower : రోజువారి ఆహారంలో అరటి పువ్వును చేర్చుకోండి… ఎన్ని లాభాలో…!

ఈ అరటి పువ్వు అన్ని రకాల వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ అరటి పువ్వులో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాక దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా పెంచగలవు. కావున మధుమేహ సమస్యతో బాధపడేవారు ఈ అరటి పువ్వు ను తినకూడదు. అయితే ఈ అరటి పువ్వు ను తినటానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఈ పువ్వుతో ఇతర రకాల వంటకాలను తయారు చేసుకొని తీసుకోవచ్చు. అలాగే ఈ వర్షాకాలంలో ఇతర శారీరక సమస్యలను తగ్గించేందుకు మీరు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఈ అరటి పువ్వు ను కచ్చితంగా తీసుకోండి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది