Banana Peel : అరటిపండు తిని తొక్క పడేస్తున్నారా.? ఇకనుంచి అలా చేయకండి..!!
ప్రధానాంశాలు:
Banana Peel : అరటిపండు తిని తొక్క పడేస్తున్నారా.? ఇకనుంచి అలా చేయకండి..!!
Banana Peel : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. పండ్లలో అందరూ కొని తినగలిగే పండు
అరటి తొక్కలో ఉన్న గొప్పతనం తెలిస్తే పొరపాటున కూడా అరటి తొక్కల్ని పడేయరు.
Banana Peel : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. పండ్లలో అందరూ కొని తినగలిగే పండు అరటిపండు. అయితే అరటి పండులో ఎన్నో పోషకాలు దాగివున్నాయి.. అందరూ అరటిపండు తిని తొక్కని పడేస్తూ ఉంటారు. అయితే ఆ తొక్కలో కూడా అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని సంగతి చాలా మందికి తెలియదు.. అరటి తొక్కలో ఉన్న గొప్పతనం తెలిస్తే పొరపాటున కూడా అరటి తొక్కల్ని పడేయరు. అసలు అరటి తొక్కలో ఉండే పోషకాలు ఏమిటి.? ఈ తొక్కతో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం..
Banana Peel అరటి తొక్కలు తింటే బోలెడు ఆరోగ్య ఉపయోగాలు
అరటిపండుతో పాటు తొక్కలను కూడా తింటే డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులతో పోరాడే శక్తి ఉంటుంది..ఇది మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించడానికి కంటి ఆరోగ్యం మెరుగుపరచడానికి రోగనిరోధక శక్తి మెరుగు పరచడానికి ఎముకలు దృఢంగా మార్చడానికి ఈ అరటి తొక్కలు ఎంతగానో సహాయపడతాయి..
జుట్టుకు మేలు చేసే అరటి తొక్కలు: అరటిపండు తొక్కలో ఉండే సిస్టం విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్ లెపిటిన్ చర్మం దురద మొటిమల నుంచి రక్షిస్తాయి. అరటి తొక్కలు చర్మం డ్రై కాకుండా తేమగా ఉండేలా చేస్తాయి. అరటి తొక్కలను తేనె నిమ్మరసంలో మిక్సీ చేసి అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. అరటి తొక్కలను జుట్టుకి రుద్దుకుంటే జుట్టుకి కావలసిన పోషకాలు అన్ని లభిస్తాయి.
Banana Peel చర్మం, పళ్ళుకి అరటి తొక్క
అరటిపండు తొక్కతో పళ్ళు రుద్దుకుంటే పళ్ళ మీద ఉండే పసుపు మరకలు పోతాయి. పళ్ళు ప్రకాశంవంతంగా మారుతాయి. అరటి పండ్ల తొక్కలో మన చర్మానికి మేలు చేసి ఎన్నో గుణాలు ఉంటాయి. అరటిపండు తొక్కతో ముఖం పైన మసాజ్ చేసినట్లయితే ముఖం నిగారింపు మీ సొంతమవుతుంది. కళ్ళ కింద వాపు, నల్లటి మచ్చలు వృద్ధాప్య సంకేతాలు ఇటువంటి వాటికి అరటిపండు తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.. అరటి తొక్కలో ఎన్నో పోషకాలు: అరటిపండు లోనే కాదు. అరటి తొక్కలోను మన చర్మానికి మన శరీరానికి మన జుట్టుకి బోలెడు మేలు చేసే పోషకాలు ఉన్నాయి. అరటి తొక్కలో కెరటోనాయిడ్స్ పాలి పెనాల్సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీరం నుంచి ట్యాక్సీన్ బయటికి పంపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అరటిపండు తొక్కలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటి తొక్కతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..