Beauty Tips : ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అనుకుంటున్నారా…. అయితే ఈ ఫ్రూట్ తినాల్సిందే…
Beauty Tips : ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ముసలితనం రాకుండా యవ్వనంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అంటే ఈ ఫ్రూట్ తినడం వల్ల ముసలితనం అంటూ రాదట. అదేం పండు, ఎలాంటి పండు ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు యవ్వనంగా ఉంచడానికి ఉపయోగపడే పండు స్ట్రాబెరీ ఈ పండు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. దీని రుచి కొంచెం పులుపు, కొంచెం తీపు గా ఉంటుంది. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వలన అల్జీమర్స్ అనే వ్యాధి తగ్గుతుంది. అదేవిధంగా ఈ వ్యాధితో పోరాడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. యూఎస్ ఆదారిత ఆర్ హెచ్ యు క్యాంపస్లో శాస్త్రవేత్తలు ఈ పండుని పరీక్షించి ఈ స్ట్రాబెరీ లో పెలార్గోడిన్ అనే బయో ఆక్టివ్ సమ్మేళనం మెదడు సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మెదడులో టౌ ప్రోటీన్ అనే ఎంతో కఠినమైన మార్పులతో అల్జీమర్స్ అనే వ్యాధి సోకుతుంది. అయితే ఈ వ్యాధిని నయం చేయడంలో ఈ స్ట్రాబెరీ ముందుంటుంది. ఈ పండులో ఎలాంటి కణజాలు ఉంటాయి. అదేవిధంగా ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.
ఈ పండులో ఖనిజాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ పండును నిత్యం తీసుకోవడం వలన ఒళ్ళు నొప్పులు, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ పండు తినడం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు శరీరంలో అధిక కొవ్వు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది ఈ ఫ్రూట్. అని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే దీనిని తీసుకోవడం వలన అధిక బరువు పెరుగుతారని అంటూ ఉంటారు. కానీ వైద్య రంగం వారు విధానం ప్రకారం ఇదంతా అపోహ అని అంటున్నారు. ఈ పండులో విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పండు అధిక బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అదేవిధంగా ఈ పండు తినేటప్పుడు వెయిట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు.
ఈ పండులో విటమిన్ సి ఉండడం వలన కొన్ని వ్యాధులను ఎదుర్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈ పండులో ఎన్నో రకాల యాంటీ ఇన్ప్లమేటరీ, ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవన్నీ అధిక బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ స్ట్రాబెరీ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారాన్ని ఎంతో సులువుగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ పండులో ఫైబర్ ,ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉన్నాయి. దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన అధిక బరువు తగ్గడం చాలా సులువు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే స్ట్రాబెరీల ను తీసుకోవడానికి ఇష్టపడని వారు ఏదో ఒక మార్గాలలో ఈ పండును తీసుకోవచ్చు. అంటే కొన్ని ఫ్రూట్స్ తో కలిపి దీనిని తీసుకోవచ్చు. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో కూడా దీనిని యాడ్ చేసుకుని తినవచ్చు. ఇలా తినడం వలన ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు.