Beauty Tips : ఒక్కసారి ఇది అప్లై చేసి చూడండి… ముఖం మీద ఉండే మచ్చలు, మొటిమలు మటుమాయం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : ఒక్కసారి ఇది అప్లై చేసి చూడండి… ముఖం మీద ఉండే మచ్చలు, మొటిమలు మటుమాయం…

Beauty Tips : చాలామంది ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటారు. కొందరు వీటిని తొలగించుకోవడానికి పార్లర్ల చుట్టూ తిరుగుతూ, వేలవేల డబ్బులను వృధా చేస్తూ ఉంటారు. అయినా ముఖంలో ఎటువంటి మార్పు కనబడదు. అంతేకాకుండా వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గాలంటే ఈ రెండు చిట్కాలను తెలుసుకున్నారంటే మీ ముఖం అందంగా తయారవుతుంది. మొదటి ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 August 2022,3:00 pm

Beauty Tips : చాలామంది ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటారు. కొందరు వీటిని తొలగించుకోవడానికి పార్లర్ల చుట్టూ తిరుగుతూ, వేలవేల డబ్బులను వృధా చేస్తూ ఉంటారు. అయినా ముఖంలో ఎటువంటి మార్పు కనబడదు. అంతేకాకుండా వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గాలంటే ఈ రెండు చిట్కాలను తెలుసుకున్నారంటే మీ ముఖం అందంగా తయారవుతుంది. మొదటి ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 20ml బాదం పాలు తీసుకోవాలి. బాదం నానబెట్టి కొన్ని నీటిని పోసి మిక్సీ పట్టి దాన్ని వడకట్టగా వచ్చిన పాలను బాదంపాలు అంటారు. దీనికి 10 ml రోజ్ వాటర్ ని కలపాలి. తర్వాత ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల కలబంద గుజ్జును కలపాలి.

తర్వాత ఇందులో బాదం నూనె పది చుక్కలు కలపాలి. ఇది మార్కెట్లో సులువుగా దొరుకుతుంది. తర్వాత విటమిన్ ఇ క్యాపిటల్ లోపల సిరంను కలపాలి. ఈ ఐదు మిశ్రమాలను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని డిహైడ్రేడ్ కాకుండా రక్షిస్తుంది మరియు స్కిన్ స్మూత్ గా చేయడానికి, మచ్చలు తొలగించడానికి, మొటిమల దగ్గర ఉండే బ్యాక్టీరియాలను తొలగించడానికి, జిడ్డును తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి.

Beauty Tips Face pack for pimples and dark spots In Telugu

Beauty Tips Face pack for pimples and dark spots In Telugu

తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. దీని వలన పింపుల్స్ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. కనుక బయట కెమికల్స్ ఏమి ఉపయోగించకుండా ఈ నేచురల్ ప్యాక్ ని ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండవ చిట్కా అలోవెరా జెల్ బాగా ముఖానికి రాసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి స్కిన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తుంది మరియు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఇలా రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీని వలన చర్మం లో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకి వస్తాయి. కాబట్టి ఈ రెండు చిట్కాలను ఉపయోగించారంటే ఎటువంటి మచ్చలు లేకుండా ముఖం అందంగా తయారవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది