Beauty Tips : ఒక్కసారి దీంతో ఫేస్ వాష్ చేసుకున్నారంటే… ముఖం అందంగా తయారవడం గ్యారంటీ…
Beauty Tips : ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. కానీ అనేక రకాల చర్మ సమస్యలు, ఏడు సన్ టాన్ వంటి కారణాల వలన కలర్ మారిపోతారు. అయితే వంటగదిలో దొరికే మూడు పదార్థాలతో ఫేస్ వాష్ కనుక తయారు చేసుకున్నట్లయితే మొఖం అందంగా, కాంతివంతంగా తయారవుతోంది. దీనికోసం ముందుగా రెండు స్పూన్ల గోధుమపిండి తీసుకోవాలి. గోధుమపిండి ముఖంపై ఉండే జిడ్డు, మురికి పోగొట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసుకోవాలి. గ్రీన్ టీ ముఖంపై ఉంటే జిడ్డును పోగొట్టి ముఖం ఫ్రెష్ గా ఉండడానికి సహాయపడుతుంది.
దీనిని పేస్టుగా కలుపుకోవడానికి సరిపడినన్ని చల్లటి పాలు వేసుకోవాలి. చల్లటి పాలు వేసుకోవడం వలన ముఖం చల్లగా ఉంటుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కొని ప్యాక్ అప్లై చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ఉండే జిడ్డు, మురికి పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ఉండే సన్ టాన్, నల్లటి మచ్చలు, డార్క్ సర్కిల్స్, మొటిమల వలన వచ్చిన మచ్చలు వంటి సమస్యలు తగ్గిస్తాయి.
ఈ ప్యాక్ లో వారానికి రెండు మూడు సార్లు వేసుకుంటే ముఖం ఫ్రెష్ గా తెల్లగా మెరిసిపోతుంది. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్రీన్ టీ పౌడర్ ఓపెన్ ఫోర్స్ సమస్యను తగ్గిస్తుంది. గోధుమపిండి చర్మాన్ని బిగుతుగా చేసి యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. ఈ ఫేస్ వాష్ తో ముఖంపై ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ వలన ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.