Beauty Tips : పేస్ట్ లో ఇది కలిపి రాసారంటే… ముఖంలో జిడ్డు, మురికి మాయం…
Beauty Tips : చాలామందికి ఎండ పడడం వలన రంగు మారిపోయి ఉంటుంది. బట్టలు ఉన్న భాగంలో ఒక రంగు ఉంటుంది. బట్టలు లేని భాగంలో ఒక రంగు ఉంటుంది. దీనిని తగ్గించుకోవడం కోసం బ్యూటీ పార్లర్ కి వెళుతూ ఉంటారు. అక్కడ వాళ్లు దీనికోసం బ్లీచ్ పెడతారు. దీనివల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులువుగా ఇంట్లోనే కొన్ని పదార్థాలతో జిడ్డు, మురికి,సన్ టాన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలి. ఈ చిట్కా కోసం తెల్లగా ఉండే ఏ పేస్ట్ ను అయినా ఉపయోగించుకోవచ్చు.
ఈ కోల్గేట్ పేస్టు లో ఒక స్పూన్ పంచదార, రెండు స్పూన్ల తేనె వేసి బాగా కలుపుకోవాలి. పంచదార ముఖంపై స్క్రబ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. తేనె ముఖాన్ని మాయిశ్చరైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖం కాంతివంతంగా మెరవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపి కాళ్లు, చేతులు, మెడ వంటి నల్లగా ఉన్న ప్రదేశాలలో రాసుకొని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి చేతితో మసాజ్ చేసుకోవాలి.
మసాజ్ చేయడం వలన స్కిన్ పై ఉండే జిడ్డు, మురికి, సన్ టాన్, డెడ్ స్కిన్ సెల్స్ పోయి చర్మం అందంగా ప్రకాశవంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ముఖంపై ట్రై చేయాలనుకుంటే ఒకసారి కొద్దిగా రాసి ఎటువంటి రియాక్షన్ లేకపోతే అప్పుడు ట్రై చేయండి. చర్మం పై ఉండే జిడ్డు, మురికి పోగొట్టి చర్మం తెల్లగా కాంతివంతంగా తయారు కావడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగదు కనుక అన్ని వయసులవారు ప్రయత్నించవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో ఒకాన్ని అందంగా కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు.