Curry Leaves : ప్రతిరోజు పరిగడుపున కరివేపాకు నీళ్లను తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!
Curry Leaves : దక్షిణాది వంటకాలలో కరివేపాకు అనేది కచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ వంటల లో కరివేపాకు వేస్తే రుచి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాక వండినప్పుడు కూడా సువాసన కూడా వస్తుంది. కానీ వంట అనేది రుచిని పెంచడానికి మరియు సువాసనకు మాత్రమే కాక కరివేపాకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అలాగే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ ఏ బి సి ఇ లాంటి ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. […]
ప్రధానాంశాలు:
Curry Leaves : ప్రతిరోజు పరిగడుపున కరివేపాకు నీళ్లను తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!
Curry Leaves : ప్రతిరోజు పరిగడుపున కరివేపాకు నీళ్లను తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!
Curry Leaves : దక్షిణాది వంటకాలలో కరివేపాకు అనేది కచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ వంటల లో కరివేపాకు వేస్తే రుచి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాక వండినప్పుడు కూడా సువాసన కూడా వస్తుంది. కానీ వంట అనేది రుచిని పెంచడానికి మరియు సువాసనకు మాత్రమే కాక కరివేపాకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అలాగే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ ఏ బి సి ఇ లాంటి ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఈ కరివేపాకు అనేది శరీరంలోని ఇతర వ్యాధులకు అనగా కడుపునొప్పి మరియు జీర్ణ క్రియ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ఒంట్లో కొవ్వును కూడా నియంత్రిస్తుంది. అయితే దీనిని వంటకు మాత్రమే కాకుండా నీళ్ళ లో కలుపుకొని డిటాక్స్ వాటర్ లా కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ కరివేపాకును రోజు తినటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురింపబడిన ఒక నివేదిక ప్రకారం చూస్తే, కరివేపాకును నిత్యం కచ్చితంగా తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లిజరైడ్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచవచ్చు. అలాగే ఈ కరివేపాకుతో నానబెట్టిన నీళ్లు శరీరంలో పేర్కొన్న టాక్సిన్స్ ను సహజ పద్ధతిలో నియంత్రించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అయితే మన శరీరంలో పేర్కొన్న ఈ విష పదార్థాలను కూడా తొలగిస్తుంది. అలాగే పోట్ట మరియు చర్మం,జుట్టు లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే శరీర అధిక బరువు కూడా తగ్గుతుంది…
అయితే జీర్ణ రుగ్మతలతో బాధపడేవారు నిత్యం మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కరివేపాకుతో నాన పెట్టిన నీళ్లను మాత్రం ఎన్నో రకాల కడుపు సమస్యలతో పాటు మలబద్ధకాన్ని నయం చేయటంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కరివేపాకులో ఆల్కలాయిడ్స్ మరియు కార్బజ్ జోల్ ఉంటాయి. ఇది శరీరం నుండి ఎక్కువ కొవ్వును తొలగించడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే మీరు వ్యాయామంతో పాటుగా కరివేపాకును నిత్యం కచ్చితంగా ఖాళీ కడుపుతో లేక వంటల్లో వేసుకొని తినడం వలన కొవ్వు అనేది ఎంతో వేగంగా తగ్గుతుంది…