Empty Stomach : పరగడుపున ఒక స్పూన్ నెయ్యి గ్లాసు నీళ్లతో కలిపి తీసుకుంటే చాలు.. నమ్మలేని లాభాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Empty Stomach : పరగడుపున ఒక స్పూన్ నెయ్యి గ్లాసు నీళ్లతో కలిపి తీసుకుంటే చాలు.. నమ్మలేని లాభాలు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :28 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Empty Stomach : పరగడుపున ఒక స్పూన్ నెయ్యి గ్లాసు నీళ్లతో కలిపి తీసుకుంటే చాలు.. నమ్మలేని లాభాలు...!

Empty Stomach : పరగడుపున నెయ్యి తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..? మనకు మార్కెట్లో రెండు రకాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి, ఒకటి గేదపాలతో తయారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేదంలో ఆవు నెయ్యిని మాత్రమే వాడుతారు. ఎందుకంటే మన శరీరానికి కలిగించే అనారోగ్య సమస్యలను నయం చేసే గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఆవు నెయ్యిని చాలామంది వంటల్లో వాడుతూ ఉంటారు. తీపి వంటకాలలో వాడతారు. అలాగే పరగడుపున 5 ml నుంచి 10 ml వరకు తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం చూద్దాం… అయితే నెయ్యిని తాగాక 30 నిమిషాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో రసానయంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఉత్తేజ పరుస్తుంది. దీంతో శారీరిక దృఢత్వం కలుగుతుంది.

ఆవు నెయ్యిని రోజు తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంలో సహజ సిద్ధంగా ఆయిల్స్ శ్రవించడం బాలన్స్ అవుతుంది.. దీంతో చర్మానికి సరైన మార్చరైజర్ అంది చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆవు నెయ్యిని రోజు దీర్ఘకాల పాటు తాగితే ఫలితంగా కీళ్లలో లూబ్రికేషన్ అవుతుంది. దాని ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లు సులభంగా కదులుతాయి. పరగడుపున ఆవు నెయ్యిని తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిన్నపిల్లలకు పరగడుపున నెయ్యి తినిపించడం వలన చురుగ్గా, యాక్టివ్ గా ఉంటారు. నెయ్యి తీసుకోవడం వలన శరీర బరువు పెరుగుతుందని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు.

ఎందుకంటే నెయ్యి వల్ల బరువు పెరగరు తగ్గుతారు.. ఎందుకంటే జీర్ణక్రియ ప్రక్రియను పెంపొందిస్తుంది. శరీర మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. వెంట్రుకలకు సహజసిద్ధమైన ఆయిల్స్ అందుతాయి. శిరోజాలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. ఈ నెయ్యిలో క్యాన్సర్ అణాలను నాశనం చేసే గుణాలు నెయ్యిలో ఉంటాయి. దీంతో రోజు పరిగడుపున నెయ్యి తాగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది