Diabetes : చేదు కాదది అమృతం.. ఈ జ్యూస్ తో షుగర్ పరార్..!
Diabetes : కూరగాయలన్నింటిలో ఎక్కువ మందికి నచ్చనిది కాకరకాయ. రుచి పరంగా చాలా చేదుగా ఉండటం వల్ల చాలా మంది దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా మందు లేని డయాబెటిస్ వంటి రోగాలకు ఇది మంచి వైద్యంగా పనిచేస్తుంది. కాకరకాయ వల్ల షుగర్ తో పాటు ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఇంకా ఎన్నో సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయను కూరలాగా, ఫ్రై లాగే కాక.. జ్యూస్ లాగా సేవించిన ఎన్నో ఫలితాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా ఈ చేదు జ్యూస్.. షుగర్ వ్యాధికి అమృతంలా పని చేస్తుందని చెబుతున్నారు.
Diabetes : కాకర జ్యూస్ తో షుగర్ పరార్..!
కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటివి మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. చేదుగా ఉందనే కారణంతో దీనిని వంటల్లో నుంచి తీసేయడం సరి కాదంటున్నారు. కాకరలోని చేదు వల్ల.. బ్లడ్ షుగర్ లెవెల్స్ తో పాటు ఇంఫ్లేమేషన్ లెవెల్స్ మారుతూ ఉంటాయని అంటున్నారు. కాకరకాయలు మీ శరీరం విలువ చేసే పోషకాలను గ్లూకోజ్ మార్చకుండా మరియు దాన్ని రక్తంలోకి విడుదల చేయకుండా నిరోధిస్తాయని అంటున్నారు.
Diabetes : ఉదయాన్నే పరగడుపున తాగడం బెటర్..!
కాకరకాయ జ్యూస్ ను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల షుగర్ ను చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలుపుతున్నారు. ప్రధానంగా షుగర్ ఉన్న తల్లిదండ్రుల నుంచి తమకు… ఆ వ్యాధి వస్తుందేమోనని భయపడుతున్న వారి వారసులు… వారానికి ఓసారైన కాకరను వారి భోజనం లో చేర్చుకుంటే… షుగర్ నుంచి వారికి విముక్తి కలిగే అవకాశం ఉందని అంటున్నారు.