Gastric Problems : ఈ ఒక్క డ్రింక్ తో మీ గ్యాస్ సమస్య మటుమాయం… రాత్రి భోజనం తర్వాత తాగి చూడండి…!
ప్రధానాంశాలు:
Gastric Problems : ఈ ఒక్క డ్రింక్ తో మీ గ్యాస్ సమస్య మటుమాయం... రాత్రి భోజనం తర్వాత తాగి చూడండి...!
Gastric Problems : చాలామంది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమస్యతో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.. ఇక ఈ గ్యాస్ సమస్య నుంచి బయటపడడం కోసం ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి హెర్బల్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హెర్బల్ టీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో గ్యాస్ మలబద్ధకం అజీర్ణం లాంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది.అలాగే ఇది బరువును కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.. జీలకర్ర టీ: జీలకర్రను సుమారుగా అన్ని వంటలలో వినియోగిస్తూ ఉంటారు.
జీలకర్రతో చేసిన టీ జీర్ణ సమస్యల నుంచి బయటపడేస్తుంది. జీలకర్రలో కార్మి నేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధకం, అజీర్ణం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జీలకర హెర్బల్ టీ తయారు కోసం జీలకర్ర ను కొద్దిగా వేయించి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీటిలో ఈ పొడి వేసి నిమ్మరసం పిండుకొని తీసుకోవాలి. పుదీనా టీ: జీర్ణ సమస్యల నుంచి బయటపడడం కోసం పుదీనా టీ ఉపయోగపడుతుంది. అజీర్ధం గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని తయారీ కోసం ఒక కప్పు నీటిని తీసుకుని దానిలో పుదీనా ఆకులు వేసి మరిగించుకోవాలి. తర్వాత దాంట్లో కాస్త నిమ్మరసం కలుపుకొని తీసుకోవాలి..అల్లం టీ: అలాంటి ఉపయోగంతో లాలాజల గ్రంధులు పిత్త ఉత్పత్తి గ్యాస్ ఎంజైములను ఉత్తేజ పరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది జీర్ణ సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. తయారు కోసం ఒక కప్పు నీటిలో అల్లం తురుమును వేసి మరిగించాలి. తర్వాత వడకట్టి దానిలో నిమ్మరసం తేనె కలిపి త్రాగాలి…
సోంపు టీ: ఈ సోంపుకి భోజనం తర్వాత తీసుకోవడం వలన వాత దోషం తగ్గుతుంది. ఇది గ్యాస్ మరియు కడుపుబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థ మెరుగుపరష్టానికి ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక కప్పు నీరు తీసుకుని దానిలో కొన్ని సోంపు గింజలు వేసి మరిగించాలి. మరిగిన తర్వాత దీనిలో కొంచెం తేనెను కలుపుకొని సేవించాలి. చమోమిలే టీ: ఈ టీలో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో చమేమీలే టీ బ్యాగు వేసి ఆ నీటిని కొద్ది కొద్దిగా సేవిస్తూ ఉండాలి… ఈ విధంగా తాగినట్టయితే గ్యాస్ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు…