Black Coffee : కాఫీ లవర్స్ కు గుడ్ న్యూస్… ఇలా తాగారంటే మీ శరీరంలో కొవ్వు మంచులా కరుగుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Black Coffee : కాఫీ లవర్స్ కు గుడ్ న్యూస్… ఇలా తాగారంటే మీ శరీరంలో కొవ్వు మంచులా కరుగుతుంది..!

Black Coffee : సహజంగా కొంతమంది ఇష్టపడి తాగే డ్రింక్ కాఫీ.. చాలామంది కాఫీని ప్రేమతో తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. ఈ కాఫీని అలసట నుంచి బయటపడడం కోసం కూడా ఎన్నోసార్లు తాగుతూ ఉంటారు. అయితే కాఫీ లవర్స్ అయితే మీకు గుడ్ న్యూస్.. ఎందుకంటే ఒక కప్పు కాఫీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందట. ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకోవాలి. కాఫీలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Black Coffee : కాఫీ లవర్స్ కు గుడ్ న్యూస్... ఇలా తాగారంటే మీ శరీరంలో కొవ్వు మంచులా కరుగుతుంది..!

Black Coffee : సహజంగా కొంతమంది ఇష్టపడి తాగే డ్రింక్ కాఫీ.. చాలామంది కాఫీని ప్రేమతో తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. ఈ కాఫీని అలసట నుంచి బయటపడడం కోసం కూడా ఎన్నోసార్లు తాగుతూ ఉంటారు. అయితే కాఫీ లవర్స్ అయితే మీకు గుడ్ న్యూస్.. ఎందుకంటే ఒక కప్పు కాఫీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందట. ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకోవాలి. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ ఆసిడ్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగినట్లయితే.. ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు.. కేఫిన్ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

Black Coffee కాఫీ వ‌ల్ల‌  సమస్యకు ఈజీగా చెక్

కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటే ఈరోజు నుంచి ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం మొదలు పెట్టండి. మీరు బరువు తగ్గాలనుకుంటే కాఫీలు చెక్కర మొలాసిస్, పాలు, చాక్లెట్ సిరప్ లేదా వెనీలా వంటివి అసలు కలపొద్దు. కాఫీ రోగ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా జీవక్రియ పనితీరు మెరుగుపడుతుంది.. ఈ బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆ మూలకాలన్నీ క్యాన్సర్ ను తగ్గిస్తాయి.మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇది శరీరంలో జీవక్రియను కూడా పెంచుతుంది. దాని ఫలితంగా బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒక కప్పు బ్లాక్ కాఫీలో రెండు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఈ బ్లాక్ కాఫీలు విటమిన్ బి2 బి3, మెగ్నీషియం, పొటాషియం వివిధ వినాలిక రసాయనాలు సహజంగా కాఫీలో ఉంటాయి. అలాగే బ్లాక్ కాఫీలో పాలు లేదా చక్కెర ఉండదు. కాబట్టి ఈ కాఫీ తాగడం వలన కొవ్వులు కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్లు శరీరానికి అందవు.. బ్లాక్ కాఫీ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. రోజంతా ఉల్లాసంగా శక్తివంతంగా మార్చుతుంది. ఈ బ్లాక్ కాఫీలో ఆంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది మెదడులోని సిరుటోని డోపమైన్ లెవెల్స్ ను పెంచుతాయి. దాని ఫలితంగా డిప్రెషన్ ఒత్తిడి ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది