Jamun Fruit : నేరేడు పండ్లలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు… ఈ సమస్యలన్నింటికీ దివ్య ఔషధం…!
Jamun Fruit : వేసవి లో మనకి దొరికే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి రుచికి తీయగాను మరియు పుల్లగా కూడా ఉంటాయి. అందుకే ఈ పండ్లు చాలా మందికి చాలా ఇష్టం. నేరేడు పండ్లు అనేవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహానికి ఈ నేరేడు పండ్లు అనేవి చాలా బాగా మేలు చేస్తాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, మధుమేహ రోగులు రక్తదానం అసలు చేయకూడదు. ఇది దాతకు శరీర సమస్యలను కూడా కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనేది ప్రతి రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లు ఉన్నట్లుగా అధ్యయనాలు తెలిపాయి. ఇలాంటి షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట నేరేడు పండ్లు అనేది ఒక దివ్య ఔషధంగా పని చేస్తాయి..
నేరేడు పండులో ఫైబర్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని ఫలితంగా జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఎంతో బాగా పని చేస్తుంది. అంతేకాక మలబద్ధకం నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. నేరేడు పండులో విటమిన్ సి అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని ఫలితంగా ఈ పండును ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి అనేది ఎంతో బాగా మెరుగుపడుతుంది. అలాగే జలుబు, ఫ్లూ లాంటి ఇతర ఇన్ఫెక్షన్ నుండి కూడా మిమ్మల్ని ఎంతగానో రక్షిస్తుంది. వివిధ చర్మ సమస్యలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
నేరేడు పండు దంతాలు మరియు చిగుళ్ల సమస్యలను కూడా నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి చిగుళ్ళను బలోపేతం చేసేందుకు మరియు నోటి దుర్వాసనను నియంత్రించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిను నియంత్రించడంలో కూడా నేరేడు పండ్లు అనేవి ఎంతో బాగా మేలు చేస్తాయి. దీని ఫలితంగా నేరేడు తినడం వలన గుండె సమస్యలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. శరీరంలో హారికరమైన కార్బన్ డయాక్సైడ్ స్థాయిని కూడా నియంత్రించడం వలన శరీరంలోని ప్రతిభాగానికి కూడా ఆక్సిజన్ అనేది చేరుకోవడానికి నేరేడులోని కొన్ని పోషకాలు సహాయం చేస్తాయి. ఇది అధిక రక్తపోటు నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది..