Black Salt : నల్ల ఉప్పుతో బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయొచ్చు తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Salt : నల్ల ఉప్పుతో బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయొచ్చు తెలుసా…!!

 Authored By aruna | The Telugu News | Updated on :30 August 2024,10:00 am

Black Salt : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యలలో ఒకటి మధుమేహం వ్యాధి. ఇది ఎంతోమంది ప్రాణాలను తీసుకుంటుంది. ఈ వ్యాధి అనేది సైలెంట్ కిల్లర్ లా ఎటాక్ చేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించలేకపోతున్నారు ప్రజలు. కానీ ఈ వ్యాధి అనేది మనిషి యొక్క శరీరం లోపల భాగాలను పనికి రాకుండా మారుస్తుంది. అప్పుడు గాని ఈ వ్యాధి అనేది బయటపడదు. అయితే మధుమేహంతో శరీరం అనేది పోటిబారటం స్టార్ట్ అవుతుంది. ఇది ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే మధుమేహంతో బాధపడేవారు తీసుకునే ఆహారంలో మరియు తాగే వాటిలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే రక్తంలో చక్కెర అనేది అదుపులో ఉంటుంది. అందుకే నల్ల ఉప్పు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వలన మలబద్ధక సమస్య కూడా దూరం అవుతుంది. అలాగే బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఈ నల్ల ఉప్పుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

నల్ల ఉప్పు అనేది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనదిగా చెబుతుంటారు. ఈ ఉప్పును వాడడం వలన గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం,కొలెస్ట్రాల్ సమస్యలు అనేవి దరి చేరకుండా ఉంటాయి. దీనిలో ఐరన్, సోడియం, కాల్షియం లాంటి మూలకాలు ఎన్నో ఉన్నాయి. అయితే మధుమేహ పేషెంట్లు తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు తీసుకోవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది అని అంటున్నారు. అయితే సాధారణ ఉప్పులో కంటే నల్ల ఉప్పులో సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది రక్తంలోని చక్కెరకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ నల్ల ఉప్పును నీటిలో కలిపి తీసుకుంటే మధుమేహ సమస్య అనేది నయం అవుతుంది అని అంటున్నారు నిపుణులు. అయితే ఉదయాన్నే ఈ ఉప్పును వేడి నీటిలో కలిపి తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. ఈ నల్ల ఉప్పు శరీరానికి ఎంతో అవసరమైన ఇనుము మరియు కాల్షియం, మెగ్నీషియం లాంటి ఎంతో ముఖ్యమైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి…

నిత్యం ఈ నల్ల ఉప్పును తీసుకోవటం వలన ఎసిడిటీ మరియు అపానవాయువు సమస్య కూడా తగ్గుతుంది. ఇది కాలేయానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకున్నట్లయితే గ్యాస్ నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ నల్ల ఉప్పు అనేది ఎసిడిటీ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ నల్ల ఉప్పు ను మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ నల్ల ఉప్పు లో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ రక్తపోటును తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న వ్యర్ధాలను కూడా బయటకు పంపించడంలో ఈ ఉప్పు అనేది ఎంతో మేలు చేస్తుంది. దీని వలన జీర్ణాశయం అనేది ఎంతో క్లీన్ అవుతుంది. అలాగే పైల్స్ తో బాధపడే వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నల్ల ఉప్పులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీనిలో చాలా తక్కువ మోతాదులో సోడియం స్థాయిలు అనేవి ఉంటాయి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది