Blood : రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఇవే…వీటిని తీసుకుంటే చాలు… రోగాలన్నీ పరార్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Blood : రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఇవే…వీటిని తీసుకుంటే చాలు… రోగాలన్నీ పరార్…!!

Blood : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో అన్ని అవయవాలు కూడా సక్రమంగా పని చేయాలి. అయితే అన్ని భాగాలకు కూడా రక్తం అనేది సక్రమంగా అందినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అయితే రక్తంలో కూడా టాక్సిన్స్ అనేవి పేరుకు పోతాయి. ఇది మీకు వింతగా అనిపించిన నిజం. అయితే రక్తం శరీరంలోని ప్రతి భాగానికి కూడా ఆక్సిజన్ ను తీసుకుపోతుంది. అంతేకాక ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, హార్మోన్లను కూడా రక్తం సరఫరా చేస్తుంది. ఇది […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Blood : రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఇవే...వీటిని తీసుకుంటే చాలు... రోగాలన్నీ పరార్...!!

Blood : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో అన్ని అవయవాలు కూడా సక్రమంగా పని చేయాలి. అయితే అన్ని భాగాలకు కూడా రక్తం అనేది సక్రమంగా అందినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అయితే రక్తంలో కూడా టాక్సిన్స్ అనేవి పేరుకు పోతాయి. ఇది మీకు వింతగా అనిపించిన నిజం. అయితే రక్తం శరీరంలోని ప్రతి భాగానికి కూడా ఆక్సిజన్ ను తీసుకుపోతుంది. అంతేకాక ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, హార్మోన్లను కూడా రక్తం సరఫరా చేస్తుంది. ఇది శరీర pH సమతుల్యతను కూడా రక్షిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. అందుకే రక్తన్ని సరిగ్గా శుద్ధి చేయకపోతే అప్పటి నుండి ఇతర శారీరక సమస్యలు మొదలవుతాయి. అలాగే చర్మం మరియు మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు,కాలేయంలో ఇతర రకాల సమస్యలు మొదలవుతాయి. అయితే రక్తం నుండి విషాన్ని బయటికి పంపించడంలో తగినన్ని నీళ్లు తాగడంతో పాటుగా కొన్ని ముఖ్య ఆహారాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. అయితే మనం తీసుకోవాల్సిన ముఖ్య ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

Blood  నిమ్మరసం

నిమ్మరసం అనేది రక్తం మరియు జీర్ణ వ్యవస్థను క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే నిమ్మకాయలో ఉండే ఆమ్ల గుణాలు శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను కూడా బయటకు పంపిస్తుంది. అందుకే మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలుపుకొని తాగండి…

బీట్ రూట్ జ్యూస్ : బీట్ రూట్ అనేది బ్లడ్ ప్యూరిఫైయర్ గా పని చేస్తుంది. ఈ దుంపలు అనేవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు మరియు రక్తాన్ని నిర్వీషీకరణ చేసేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాక ఇది రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతుంది…

పసుపు : పసుపు అనేది మన భారతదేశంలో ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటుంది. అయితే పసుపు అనేది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తో కూడా పోరాడుతుంది. అలాగే కాలేయ పనితీరును కూడా పెంచుతుంది. అందుకే పాలల్లో పసుపు కలుపుకొని తాగాలి. అలాగే రోజువారి వంటల్లో పసుపు వేసుకొని తీసుకున్న కూడా ఆరోగ్యం బాగుంటుంది…

వెల్లుల్లి : చాలామంది వెల్లుల్లి ని నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు పచ్చగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ వెల్లుల్లి కాలేయం మరియు రక్తాన్ని నిర్విషీకరణ చేయటానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు రక్తాన్ని క్లిన్ చేయడంతో పాటుగా పేగు ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అందుకే మీరు రోజు అన్నంలో పచ్చి వెల్లుల్లి తీసుకుంటే మంచిది…

Blood రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఇవేవీటిని తీసుకుంటే చాలు రోగాలన్నీ పరార్

Blood : రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఇవే…వీటిని తీసుకుంటే చాలు… రోగాలన్నీ పరార్…!!

బ్రోకలీ : బ్రోకలీ అనేది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ కూరగాయలో కాల్షియం, ఒమేగా-3,ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, ఫాస్పరస్ లు కూడా ఉన్నాయి. ఇవి రక్తాన్ని క్లీన్ చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి..

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది