Blood : మీకు ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. రోజూ ఉద‌యం లేవ‌గానే రెండు గ్లాసుల ఈ జ్యూస్ తాగండి.. మీ ఒంట్లో ర‌క్తం అమాంతం పెరుగుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Blood : మీకు ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. రోజూ ఉద‌యం లేవ‌గానే రెండు గ్లాసుల ఈ జ్యూస్ తాగండి.. మీ ఒంట్లో ర‌క్తం అమాంతం పెరుగుతుంది..!

Health Tips : ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. రక్త హీనత. ఒంట్లో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల మనిషి బలం తక్కువవడం.. ఎటువంటి పని చేయలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే.. చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లీష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలకు రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల.. వాళ్లకు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 March 2021,10:58 am

Health Tips : ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. రక్త హీనత. ఒంట్లో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల మనిషి బలం తక్కువవడం.. ఎటువంటి పని చేయలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే.. చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లీష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలకు రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల.. వాళ్లకు రక్త హీనత సమస్య వస్తుంటుంది. మరికొందరిలో ఇతర సమస్యల వల్ల రక్తం తక్కువగా ఉంటుంది. అయితే.. మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు. ఒక్క ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు.

how to increase blood in human body with food

how to increase blood in human body with food

నిజానికి.. మన ఒంట్లో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఎక్కువ ఉంటే.. మన ఒంట్లో అంత రక్తం ఉన్నట్టు తెక్క. సాధారణంగా పురుషులకైతే.. 13. 5 నుంచి 16. 5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. మహిళలకు అయితే.. 12 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 మధ్యలో ఉండాలి.

Health Tips : రక్తాన్ని ఎలా పెంపొందిచుకోవాలి?

మన ఒంట్లో రక్తం పెరగాలంటే మన ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి. మహిళలకు ప్రతి రోజు 30 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. పురుషులకు అయితే రోజూ 28 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువ ఐరన్ ఉండేలా చూసుకోవాలి.

how to increase blood in human body

how to increase blood in human body

Health Tips : రోజూ ఉదయమే క్యారెట్ జ్యూస్ తాగండి

రక్తం త్వరగా పెరగాలి అంటే.. రోజూ ఉదయం.. క్యారెట్ జ్యూస్ తాగండి. పండ్ల రసాలు కంటే.. క్యారెట్ జ్యూస్ మేలు. షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే.. క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చు. ఉదయం పూట రెండు క్యారెట్లు, బీట్ రూట్, టమాట, కీర దోశతో కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి, తేనె కలుపుకొని తాగితే చాలు. ఇలా.. ప్రతి రోజూ తాగితే.. ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది. ఒకవేళ గోదుమ గడ్డి పొడి దొరికినా.. దాన్ని కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం పూట ఏదైనా ఒక పండ్ల జ్యూస్ తాగండి. బత్తాయి జ్యూస్ కానీ.. కమలం జ్యూస్ అయినా.. ఏదైనా పండ్ల జ్యూస్ తాగొచ్చు. లేదంటే ఒక గ్లాస్ చెరుకు రసం తాగినా చాలు. పండ్ల జ్యూస్ లో ఇంత తేనె, ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని తాగండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Mind Diet : శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్కటే డైట్.. ఇది పాటిస్తే చాలు.. రోగాలన్నీ మటాష్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Mobile : నిద్ర లేవ‌గానే మీరు వెంట‌నే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జ‌బ్బు ఉన్న‌ట్లే..?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది