Brain Stroke : ఈ అలవాట్లను వెంటనే మానుకోకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తప్పదట…!!
Brain Stroke : మారుతున్న జీవనశైలి విధానం ప్రకారం ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. కొందరికి ప్రాణాంతకర వ్యాధులుతో కొందరికి దీర్ఘకాలిక వ్యాధులుతో రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తున్న వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. ఇది శరీరంలోని వివిధ భాగాలలో పక్షవాతం కూడా కలిగిస్తుంది.ఆరోగ్యకరమైన జీవనశైలి గడపడం వలన ఈ వ్యాధిని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే కింది అలవాట్లు ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికమని చెప్తున్నారు.
అయితే వెంటనే వీటిని మానుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అధిక రక్తపోటు సమస్యలు ఉన్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కావున రక్తపోటును కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ధూమపానం లాంటి అలవాట్లు చాలా ప్రమాదకరం. ధూమపానం చేసే వారికి ఎప్పుడు ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందో ఎవరికి తెలియదు కావున మద్యపానం ధూమపానం చేసేవారు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నట్లే.. అలాగే ఒత్తిడికి లోనయ్యేవారు పదేపదే ఆందోళన పడేవారు బ్రెయిన్ స్ట్రోక్ కి గురవుతారు. మధుమేహాన్ని కంట్రోల్ లేని వారు కూడా ఈ వ్యాధిని భారిన పడతారు.
రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉందని తెలియని వారు ఈ వ్యాధిని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ఆయిల్, స్పైసి ఫుడ్ అధికంగా తీసుకునే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .. శారీరిక శ్రమ లేనివారు అంటే శరీర కదలిక లేకుండా ఎప్పుడు పడుకుని గడిపేవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. కావున ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం అంటే సరియైన ఆహారం తీసుకోవడం కొన్ని వ్యాయామలు చేయడం వలన ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు..