Brain Stroke : ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే ఇవి పక్కా బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలే..!
Brain Stroke : ఇప్పటికే వృద్ధుల్లో ప్రబలంగా కనిపించే స్ట్రోక్ సమస్య ఇప్పుడు యువతను కూడా దీని బారిన పడుతోంది. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరమైనది. అధిక రక్తపోటు, ఊబకాయం, ధూమపానం వంటి సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్‌కు ముందే కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటంటే.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్ట్రోక్ విషయాలపై ఇటీవల నివేదిక విడుదల చేసింది. అందులో స్ట్రోక్‌ను ప్రాథమికంగా గుర్తించేందుకు అవసరమైన కొన్ని కీలక లక్షణాలు పేర్కొన్నారు.
Brain Stroke : ఇలా చేయండి..
స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి నిలబడటం, నడవటం కష్టం అవుతుంది. శరీరం వణికే అవకాశం ఉంటుంది.కళ్ళు తెరవడం లేదా మూసుకోవడం కష్టమవుతుంది. కనురెప్పలపై నియంత్రణ తగ్గుతుంది.ఒక వైపు ముఖం మెలికలు తిరుగుతుంది. నోరు వంకరగా ఉండటం కనిపించవచ్చు. మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు, మాటలు తడబడతాయి. చేతులు లేదా కాళ్లలో తిమ్మిరి వస్తుంది. బలహీనతతో చేతులు లేదా కాళ్ళు పనిచేయకపోవచ్చు.
Brain Stroke : ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే ఇవి పక్కా బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలే..!
ఇది పక్షవాతానికి సంకేతం కావచ్చు.ఒకరు సరిగ్గా గుర్తించలేకపోవడం, ఇటీవలి సంఘటనలను గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి మానసిక సమస్యలు కనిపిస్తాయి.పైన పేర్కొన్న సంకేతాలు కనిపించిన వెంటనే వెంటనే నెరసిమ్మగా స్పందించాలి. ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లాలి. ప్రాథమిక చికిత్స 3 నుంచి 4.5 గంటల వ్యవధిలో మొదలైతే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.