Heart Attack : మీరు ఇలా చేస్తే మీకు జన్మలో గుండెపోటు రానే రాదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Attack : మీరు ఇలా చేస్తే మీకు జన్మలో గుండెపోటు రానే రాదు…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Heart Attack : మీరు ఇలా చేస్తే మీకు జన్మలో గుండెపోటు రానే రాదు...!

Heart Attack : చాలామంది టైం కుదరక ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమ క్రమంగా గ్యాస్ సమస్య అంటే పెరిగి శరీరం పటుత్వాన్ని కోల్పోవడం జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం అంటే సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా అలిబియా బింగి అనే వ్యాధి సోకడానికి కూడా సరైన సమయానికి భోజనం చేయకపోవడమే.. ఈ వ్యాధులు మనుషులను శారీరకంగా మానసికంగా కుంగతిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులు మనుషులపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోవాల్సిన ఇడ్లీ, దోస, వడ పూరి లాంటి టిఫిన్లను టైం తప్పించి లంచ్ టైం లోనో లేక ఇంకా పనులు ఆలస్యమైతే డిన్నర్ టైంలోనూ తీసుకుంటూ ఉంటారు.

కానీ అలా చేయడం ఆరోగ్యా రీత్యా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే.. ప్రతిరోజు ఉదయం తీసుకోవాల్సిన బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు మిస్ కావొద్దు. రోజు సమయానికి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని హార్బర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో తెలిపింది. ఎందుకంటే మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల మధ్యాహ్నం లంచ్ సమయం అయ్యేసరికి ఆకలి బాగా పెరిగిపోతుంది. దీంతో లంచ్ పరిమాణము పెరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్ పెరగడానికి దారి తీస్తుంది. దీనివల్ల డయాబెటిస్ బ్లడ్ ప్రెషర్ అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. నిజానికి మధ్యాహ్నం తీసుకునే ఆహారమే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ మిగిలిన రోజంతా ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తాయి. అధిక తీపి నూనె పదార్థాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయి ఆ తర్వాత వెంటనే తక్కువ స్థాయికి పడిపోతుంది. దాంతో మళ్లీ ఎక్కువగా ఆకలి వేస్తుంది.

ఫలితంగా మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే అలవాటుకు బానిసగా మారిపోతాం. అందుకే శరీరంలో బ్లడ్ షుగర్ ఒకే రీతిలో ఉండాలి అంటే.. ఉదయం సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేయడం ఉత్తమం.సాధారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్ లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రుల్లో విశ్రాంతి సమయమే కనుక డిన్నర్ స్వల్పంగా ఉండాలి. ఒకవేళ లంచ్ తక్కువగా డిన్నర్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తే డిన్నర్ లో తీసుకునే ఆహారం చాలా తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకోవాలని అందుకోసం ఆహారంలో కూరగాయలు సలాడ్ ఎక్కువ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి సమయానికి టిఫిన్ చేయడం మన చేతిలో పనే కాబట్టి మీరు కూడా ఈ రోజు నుండి టైం కి బ్రేక్ ఫాస్ట్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది