Coffee : మీకో హెచ్చరిక.. ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coffee : మీకో హెచ్చరిక.. ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా..?

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Coffee : మీకో హెచ్చరిక.. ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా..?

Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా అలసటను తుడిచిపెట్టడానికి, పని మధ్యలో బ్రేక్‌గా, స్నేహితులతో చిట్‌చాట్ చేస్తూ కాఫీ తాగడం ఒక తరచిన దృశ్యంగా మారిపోయింది. కొందరికి కాఫీ తాగడం ఫ్యాషన్‌ మాత్రమే కాదు జీవనశైలిలో భాగం.

Coffee మీకో హెచ్చరిక ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా

Coffee : మీకో హెచ్చరిక.. ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా..?

కాఫీలో ప్రధానంగా ఉండే కెఫిన్ శక్తిని ఇస్తుంది, కానీ అదే కెఫిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తాత్కాలికంగా పెంచే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాయో క్లినిక్ మరియు వెబ్‌ఎమ్‌డీ లాంటి ప్రాముఖ్యమైన సంస్థలు చేసిన అధ్యయనాల ప్రకారం, కెఫిన్ వల్ల శరీరంలో అడ్రినలిన్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ స్పందనను తగ్గించి, గ్లూకోజ్‌ను ప్రాసెస్ చేయడాన్ని దెబ్బతీయవచ్చు.

మీరు తాగే కాఫీ రకం కూడా కీలకం. చక్కెర, క్రీమ్, ఫ్లేవర్డ్ సిరప్‌లతో తయారైన కాఫీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. కానీ బ్లాక్ కాఫీ – అంటే చక్కెర, పాలు లేకుండా తాగే కాఫీ – లో తక్కువ కేలరీలు ఉండడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిపై తక్కువ ప్రభావం చూపుతుంది. దీని వల్ల మంటలు తగ్గడం, మేటబాలిజం మెరుగవడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారికి, కాఫీ పానీయం విషయంలో మరింత జాగ్రత్త అవసరం. పాలు, చక్కెర కలిపిన కాఫీకి దూరంగా ఉండండిబ్లాక్ కాఫీ మాత్రమే మితంగా తీసుకోండి. ఒకరోజులో 1–2 కప్పుల కాఫీ కంటే ఎక్కువ తాగకండి. కాఫీ తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని గమనించండి

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది