Chamomile Flowers : చామంతి పులతో పూజలు మాత్రమే కాదు… అందం, ఆరోగ్యం కూడా పెంచుకోవచ్చు… ఎలాగంటే…!
Chamomile Flowers : ప్రస్తుతం చామంతి పూల సీజన్ అయితే మొదలైంది. చామంతి పూలు అనగానే చాలా మందికి పూజలు గుర్తుకు వస్తాయి. ఈ చామంతి పూలు ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. చామంతి పూలు అనేవి మంచి సువాసనను కూడా వెదజల్లుతాయి. ఈ మొక్కలను చాలామంది ఇంటిలో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ చామంతి పూలతో కేవలం పూజలు మాత్రమే కాదు అందం మరియు ఆరోగ్యం కూడా పెంచుకోవచ్చు. ఈ చామంతి పూలను వాడి ఎన్నో రకాల […]
ప్రధానాంశాలు:
Chamomile Flowers : చామంతి పులతో పూజలు మాత్రమే కాదు... అందం, ఆరోగ్యం కూడా పెంచుకోవచ్చు... ఎలాగంటే...!
Chamomile Flowers : ప్రస్తుతం చామంతి పూల సీజన్ అయితే మొదలైంది. చామంతి పూలు అనగానే చాలా మందికి పూజలు గుర్తుకు వస్తాయి. ఈ చామంతి పూలు ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. చామంతి పూలు అనేవి మంచి సువాసనను కూడా వెదజల్లుతాయి. ఈ మొక్కలను చాలామంది ఇంటిలో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ చామంతి పూలతో కేవలం పూజలు మాత్రమే కాదు అందం మరియు ఆరోగ్యం కూడా పెంచుకోవచ్చు. ఈ చామంతి పూలను వాడి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేస్తున్నారు. అయితే ఇతర టీ లాగానే చామంతి పూలతో కూడా టీ ని తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని వారంలో ఒక్కసారి తాగిన చాలు ఎన్నో రకాల ప్రయోజనాలు మనకు లభిస్తాయి. అలాగే మార్కెట్లో కూడా చామంతి పూల టీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. ఈటీ ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చామంతి పులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ చామంతి పూల టీతో ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి మాయం : చామంతి పూల టీ ని తాగటం వలన ఒత్తిడి మరియు ఆందోళన కూడా తగ్గుతాయి. ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణమైనది. అంతేకాక మానసిక సమస్యలతో బాధపడే వారు కూడా ఈ టీ ని తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది. అలాగే శరీరానికి కూడా ఎంతో రిలాక్స్ ఇస్తుంది…
నిద్ర సమస్యలు మాయం : నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా ఈ టీ ని తీసుకోవడం వలన మంచి నిద్ర అనేది పడుతుంది. అలాగే నిద్ర కూడా ఎంతో మెరుగుపడుతుంది. మీరు రాత్రి పడుకునే ముందు గనక ఈ టీ ని తాగినట్లయితే గాఢ నిద్రపోతారు. అలాగే కంటి సమస్యలు కూడా తగ్గుతాయి…
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : ప్రస్తుత కాలంలో రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం. అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నా కూడా జబ్బుల బారిన తొందరగా పడతారు. అయితే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలను తీసుకోవాలి. వాటిలో ఇది కూడా ఒకటి. ఈటీని తరచుగా తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి అనేది పెరిగి ఇతర రకాల వ్యాధులతో పోరాడేందుకు శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
సమస్యలు మాయం : చామంతి పూలతో చర్మ సమస్యలను కూడా నియంత్రించవచ్చు. ఒక కప్పులో ఎండినటువంటి చామంతి పూల పొడి మరియు ఎర్ర కందిపప్పు పొడి ఒక టీ స్పూన్ మరియు రోజ్ వాటర్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకొని సున్నితంగా రుద్ది కొద్దిసేపు అలా వదిలేయాలి. ఒక పది నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం పై ఉన్న నల్ల మచ్చలు మరియు మొటిమలు తగ్గి ముఖం అనేది సాఫ్ట్ గా ఉంటుంది…