Tea : ఈ శీతాకాలంలో ఈ అద్భుతమైన టీ తాగారంటే అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చు…!
ప్రధానాంశాలు:
Tea : ఈ శీతాకాలంలో ఈ అద్భుతమైన టీ తాగారంటే అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చు...!
Tea : వంటింటి పోపులు పెట్టలో ఉండే మసాలా ఐటమ్స్లలో దాల్చిన చెక్క ఒకటి. ఈ దాల్చిన చెక్క మంచి సువాసన ఇస్తుంది. ఈ దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే తినే ఆహారంలో మసాలా దినుసుగా దీనిని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. ఇదాలి చెక్క టీ తాగడం వలన గుండె సంబంధిత వ్యాధుల నివారిస్తుంది. దాల్చిన చెక్కను రెగ్యులర్ ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల టైప్ టు డయాబెటిస్ నియంత్రించవచ్చు.. ఈ దాల్చిన చెక్క టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాసు నీటిని ఒక గిన్నెలో వేసి తర్వాత అందులో ఒక అంగుళం దాల్చిన చెక్క వేసి మరిగించాలి.
ఇలా మరిగిన ఈ టీలో కొంచెం తేనెను కలుపుకొని ప్రతిరోజు ఈ శీతాకాలంలో తీసుకున్నట్లయితే ఎటువంటి వ్యాధులు దరిచేరవు.. కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా ఏకాగ్రతను పెంచడంలోనూ దాల్చిన చెక్క బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందట. చ అప్పుడప్పుడు ఈ టీ తాగేద్దాం.. దాల్చిన చెక్కలో సాధారణ యాంటీ ఆక్సిడెంట్ల శక్తివంతమైన పోషకం ఉంటుంది. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అంటారు. ఎక్కువ తక్కువ కాకుండా పరీక్షల సమయంలో పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తాగే ఛాయలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుంటే మంచిది.
ఇది మెదడు పనితీరును మెరుగ్గా మారుస్తుంది. ఈ టీ రోజు తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.శరీరాన్ని ఇబ్బంది పెట్టే వాపు మంట ఎలర్జీలతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీని చెక్క పొడి చేసుకొని పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది. చెక్క రూపంలో ఉంచితే ఏడాది పాటు దాని సుగుణాలు పాదనంగా ఉంటాయి. ప్రతిరోజు తాగి చాయిలో కొద్దిగా కలుపుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఈ చాయి ఎంతో మేలు చేస్తుంది. దీని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.