Curd : పెరుగు తోడు లేకుండా కూడా తోడుకుంటుంది… ఎలాగో తెలుసా…!!
Curd : మన భోజనంలో ప్రతిరోజు పెరుగు ఉండి తీరాల్సిందే. మనకు ఖచ్చితంగా భోజనం చివరిలో ఒక ముద్ద పెరుగన్నం తిననిదే కడుపు నిండదు. అయితే కొన్ని సందర్భాలలో పెరుగు అనేది ఇంట్లో ఉండదు. అలాగే మరుసటి రోజు పెరుగు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పెరుగు తోడు పెట్టాల్సిందే. దిన వలన మళ్లీ మనం బయటకు వెళ్లి తోడు తీసుకువచ్చి అప్పుడు పెరుగు తోడు పెడతాం. కానీ అలా కాకుండా కొన్ని టిప్స్ పాటిస్తే చాలు […]
Curd : మన భోజనంలో ప్రతిరోజు పెరుగు ఉండి తీరాల్సిందే. మనకు ఖచ్చితంగా భోజనం చివరిలో ఒక ముద్ద పెరుగన్నం తిననిదే కడుపు నిండదు. అయితే కొన్ని సందర్భాలలో పెరుగు అనేది ఇంట్లో ఉండదు. అలాగే మరుసటి రోజు పెరుగు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పెరుగు తోడు పెట్టాల్సిందే. దిన వలన మళ్లీ మనం బయటకు వెళ్లి తోడు తీసుకువచ్చి అప్పుడు పెరుగు తోడు పెడతాం. కానీ అలా కాకుండా కొన్ని టిప్స్ పాటిస్తే చాలు తోడు లేకుండా పెరుగును తోడిపెట్టవచ్చు. అది కూడా గడ్డ లాంటి పెరుగు. మరి దీని కోసం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సిల్వర్ రింగ్ లేక కాయిన్ : అదేమిటి వీటి వల్ల కూడా పెరుగు తోడుకుంటుందా అని అంటే కచ్చితంగా తోడుకుంటుంది అనే చెప్పాలి. దీనికోసం మీరు వాడుతున్నటువంటి సిల్వర్ లేక కాయిన్ ను శుభ్రంగా క్లీన్ చేయాలి. దీంతో పెరుగు అనేది చాలా చక్కగా తోడుకుంటుంది. అయితే గోరువెచ్చని పాలలో క్లీన్ చేసిన సిల్వర్ రింగ్ లేక కాయిన్ ఈ రెండిటిలో ఏదో ఒకటి వేసి 12 గంటల పాటు వదిలేస్తే చాలు గడ్డ పెరుగు తయారవుతుంది…
ఎండుమిర్చి : ఈ ఎండుమిర్చి అనేది పచ్చిమిర్చి గుణాలను కలిగి ఉంటుంది. వీటిని కూడా గోరువెచ్చని పాలల్లో వేసి వాటిని మునిగేలా చేయాలి. తర్వాత మూత పెట్టి 12 గంటల పాటు అలా వదిలేయండి. దీనితో కూడా పెరుగు అనేది ఎంతో చక్కగా తోడుకుంటుంది…
పచ్చిమిర్చి : మీ ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే చాలు పెరుగు తోడుకుంటుంది. దీనికోసం పచ్చిమిర్చి శుభ్రంగా క్లీన్ చేసి గుడ్డతో తోడవాలి. ఈ పచ్చి మిర్చిని గోరువెచ్చని పాలలో వేసి పన్నెండు గంటల పాటు అలా వదిలేయండి. అంతే గడ్డ పెరుగు తయారు అవుతుంది…
నిమ్మరసం : నిమ్మరసాన్ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. దీనితో కూడా పెరుగు తోడుకుంటుంది. దీనికోసం గోరువెచ్చని పాలలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దాని మూతతో కవర్ చేయాలి. తర్వాత దానిని రూమ్ టెంపరేచర్ లో 12 గంటల పాటు ఉండనివ్వాలి. అంతే టెస్ట్ గా ఉండే గడ్డ పెరుగు తయారవుతుంది…