Curd : సమ్మర్ లో ప్రతిరోజు పెరుగు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!
ప్రధానాంశాలు:
Curd : సమ్మర్ లో ప్రతిరోజు పెరుగు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!
Curd : సహజంగా భారతీయుల భోజనం అంటే తప్పకుండా పెరుగు ఉండాల్సింది.. భోజనం చివర్లో రెండు ముద్దుల పెరుగన్నం తినకపోతే భోజనం పూర్తయినట్లు అనిపించదు. పెరుగు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అయితే ఈ వేసవిలో దీన్ని ప్రతిరోజు తినకూడదని నిపుణులు చెప్తున్నారు.. ఈ సమ్మర్ లో ఎందుకు పెరుగు తినకూడదో మనం వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం… సమ్మర్ లో మన పొట్ట చల్లగా ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగును ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. పెరుగులో ప్రోయోటిక్ పోషకాల అధికంగా ఉంటాయి. పెరుగులో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్ బి అనేక సమ్మేళనాలు ఉన్నాయి.
పెరుగు తింటే కొందరికి మొటిమలు, స్కిన్ ఎలర్జీలు జీర్ణ సమస్యలు శరీరంలో వేడి వంటి వస్తాయని అంటుంటారు. పెరుగు తింటే శరీరం చల్లబడుతుంది. అయితే శరీరం వేడిని పెంచే గుణాలు ఇందులో ఉంటాయి. చాలామందికి ఇది తెలియదు. దీని గురించి ప్రముఖ పోషకాహారా నిపుణురాలు శ్వేత షాను ప్రశ్నించగా.. వేసవిలో పెరుగు తింటే అది మన శరీరంపై సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయించే వాత, పిత్త, కఫాలను బట్టి వ్యక్తికి జీర్ణవ్యవస్థ మారుతూ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పెరుగును వేడి చేయకూడదు. అలా వేడి చేస్తే అది తన స్వభావాన్ని కోల్పోతుంది. ఇందులో కఫం దోషం అధికంగా ఉండడం వలన స్థూలకాయలు పెరిగి పెరుగుతుంటాయి. అలాగే పెరుగులో పండ్లను కలపకూడదని ఆయుర్వేదం చెప్తుంది. అలా కలిపితే అవి అనుకూల మిశ్రమంగా మారతాయి..
పెరుగు తినడం వల్ల మన శరీరం ఎందుకు వేచ్చగా ఉంటుంది. పెరుగు చల్లగా ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి తింటూ ఉంటారా.. అయితే పిల్లలు తింటే వేడి పెంచే గుణాలు కలిగిన పెరుగు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. పెరుగులో కఫం, పిత్తం అధికంగా ఉంటుంది.. వాతం తక్కువ కాబట్టి ఏ సీజన్లోనైనా పెరుగు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వేసవిలో పెరుగు తింటే కొందరికి వేడి ఎక్కువగా అవడానికి ఇదే కారణం అవుతుంది. అంతేకాకుండా పెరుగు ఎక్కువగా తింటే మొటిమలు సమస్యలు వస్తాయి. అయితే మీరు సరైన పద్ధతిలో పెరుగు తింటే అది మీ ఆరోగ్యానికి చెడు కలిగించదు.. అయితే పెరుగు ఎలా తినాలి.? వేసవికాలంలో రోజు పెరుగు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. దాని బదులుగా మనం రోజు పెరుగును మజ్జిగ చేసుకుని తీసుకోవచ్చు.. దాంతో ఎటువంటి సమస్యలు ఉండవు.. మజ్జిగలో కారం, ఉప్పు, జీలకర్ర కలిపి తాగితే శరీరానికి చలవ చేస్తుంది. పెరుగులో నీటిని కలపడం వలన దాని ఉష్ణ లక్షణాలను సామనం చేస్తుంది. వేడిని తగ్గిస్తుంది. పెరుగు యొక్క శిథిలీకరణం అధికమయ్యేలా చేస్తుంది. కాబట్టి మీరు వేసవిలో పెరుగు తినాలనుకుంటే పెరుగుని నీటిలో కలుపుకొని మజ్జిగలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు..