Curry Leaves : కరివేపాకే గా అని చీప్ గా చూస్తున్నారా..? రోజు వీటి నీరు తాగితే ఎలాంటి వ్యాధులకైన ఈజీగా చెక్ పెడుతుంది..!
ప్రధానాంశాలు:
Curry Leaves : కరివేపాకే గా అని చీప్ గా చూస్తున్నారా..? రోజు వీటి నీరు తాగితే ఎలాంటి వ్యాధులకైన ఈజీగా చెక్ పెడుతుంది..!
Curry Leaves : కరివేపాకు అంటే తెలియని వారు ఎవరు ఉండరు.. కరివేపాకుని ప్రతి వంటకాలలో వినియోగిస్తూ ఉంటారు.. దీని వినియోగం రుచి అలాగే సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. కరివేపాకు లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. కరివేపాకు పప్పు, సాంబార్, చట్నీ ఇలా ఏ కూరలలో అయినా సహజంగా వినియోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఈ కరివేపాకులో ఉన్నాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున దీని ఆయుర్వేదంలో కూడా ఔషధంగా వినియోగిస్తారు.. అయితే ఇన్ని పోషకాలు ఉన్న కరివేపాకు నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
కరివేపాకు నీరు మనకు ఎన్ని విధాలుగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు అంటే ఇప్పుడు మనం చూద్దాం… మానసిక ఆరోగ్యం; ఇప్పుడున్న కాలంలో చాలామంది మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. దాని వెనక స్నేహం, ప్రేమలో ద్రోహం.. పని భారం, డబ్బు లేకపోవడం అనారోగ్యం మొదలైన కారణాలు తో ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే కరివేపాకు నీటిని తాగితే ఒత్తిడిని ఉంచి బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.. శరీర నిర్వీషికరణ: కరివేపాకు నీటిని తాగడం వలన శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషికరణ చేయడానికి దోహదపడతాయి. ఇంకా చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు ఫ్రీడాడికల్స్ ప్రమాదాలను కూడా అరికడతాయి.

Curry Leaves : కరివేపాకే గా అని చీప్ గా చూస్తున్నారా..? రోజు వీటి నీరు తాగితే ఎలాంటి వ్యాధులకైన ఈజీగా చెక్ పెడుతుంది..!
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: జీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పకుండా కరివేపాకును తీసుకోవాలి. ఎందుకంటే దీన్లో లక్సా ట్ వ్వులు ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని వలన గ్యాస్, మలబద్ధకం, విరోచనాలు లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.. అధిక బరువు చెక్: కరివేపాకు నీటిని బరువు తగ్గించే పానీయంగా వినియోగిస్తారు. దీనిని ఉపయోగం ఉబకాయాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే దీని ప్రభావం కొన్ని రోజుల తర్వాత మాత్రమే కనపడుతుంది…