Dark Chocolate : ఈ చాక్లెట్ పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది…!
Dark Chocolate : పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆహారంలో చాక్లెట్ కూడా ఒకటి. ఈ చాక్లెట్ అనేది వారికి ఒక విధంగా కోపాన్ని చల్లార్చడానికి ఒక ఆయుధం అని చెప్పొచ్చు.అయితే పిల్లలకు చాక్లెట్లు అధికంగా ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎంతో భయపడతారు. ఈ చాక్లెట్లు ఎక్కువగా తినడం వలన దంతాలు పుచ్చిపోవటంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి అని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అయితే డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఈ చాక్లెట్లు తినడం మంచిది కాదు అని అనుకుంటే పొరపాటే . నిజం చెప్పాలంటే. డార్క్ చాక్లెట్లు అనేవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ చాక్లెట్లను పిల్లలకు ఇవ్వచ్చు అని నిపుణులు అంటున్నారు. ఈ డార్క్ చాక్లెట్ వలన ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం…
పిల్లలకు డార్క్ చాక్లెట్లు అనేవి ఎంతో మంచిది అని ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇవి ఎంతో సహజమైనవి. ఇవి ఎలాంటి చక్కెర కంటెంట్ ను కలిగి ఉండవు. కాబట్టి ఈ చాక్లెట్లను ఎవరైనా తినవచ్చు..
-మంచి డార్క్ చాక్లెట్లను పిల్లలకు ఇవ్వటం ఎంతో మంచిది అని నిపుణులు అంటున్నారు. ఎందుకు అంటే. అది వారి మానసిక స్థితిని ఎంతో మెరుగుపరుస్తుంది. ఇది డోపమైన్, సెరోటోనిన్, ఎడార్పిన్ లాంటి ఎంతో సంతోషకరమైన హార్మోన్లను కూడా రిలీజ్ చేస్తుంది. ఇది పిల్లల ఒత్తిడి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
-ఈ డార్క్ చాక్లెట్ లో పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాక గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అలాగే దీనిలో ఉన్న ఐరన్, జింక్, పొటాషియం శరీరంలోని మెటబాలిక్ ప్రక్రియను పెంచేందుకు ఎంతో మేలు చేస్తుంది..
-ఈ డార్క్ చాక్లెట్ తినడం వలన పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా ఎంతో మెరుగుపడుతుంది. అందుకే ఇది పిల్లల అభ్యాస ప్రక్రియలో ఎంతో సహాయం చేస్తుంది..
– ఈ డార్క్ చాక్లెట్ ని ఒక రకమైన ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారు. ఈ చాక్లెట్ ని పిల్లలకు ప్రతిరోజు ఇవ్వడం వలన శక్తి అనేది పెరుగుతుంది. పిల్లలు రోజంతా కూడా ఎంతో చురుకుగా ఉంటారు…