Delta Plus : ‘డెల్టా ప్లస్’తో మన బతుకులు మరింత ఉల్టా పల్టా కావాల్సిందేనా?.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Delta Plus : ‘డెల్టా ప్లస్’తో మన బతుకులు మరింత ఉల్టా పల్టా కావాల్సిందేనా?..

 Authored By kondalrao | The Telugu News | Updated on :27 June 2021,9:15 am

Delta Plus : కరోనా మహమ్మారి ఇప్పటికి రెండు మహోగ్ర రూపాలను చూపించింది. లక్షల సంఖ్యలో ఊపిరులను ఆపేసింది. అంతటితో ఆగకుండా ముచ్చటగా మూడో రూపాన్ని కూడా సంతరించుకుందట. దాన్నే ప్రస్తుతం డెల్టా ప్లస్ అంటున్నారు. కరోనా కాస్తా డెల్టాగా, డెల్టా కాస్తా డెల్టా ప్లస్ గా రూపాంతరం చెందింది. దీంతో మన కష్టాలు కూడా ప్లస్ కానున్నాయనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. కొవిడ్ ఫేజ్ వన్, ఫేజ్ టు వల్ల జనాలు నరకం అనుభవించారు. ఈ నేపథ్యంలో ఇక డెల్టా ప్లస్ ఇంకెన్ని ఇబ్బందులు పెడుతుందో అని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు.

delta plus corona new varient delta plus danger bells

delta-plus-corona-new-varient-delta-plus-danger-bells

లక్షణాలేంటి?..

కరోనా వైరస్ సోకినప్పుడు కనిపించే వ్యాధి లక్షణాలే డెల్టా ప్లస్ లోనూ కనిపిస్తాయి. పొడి దగ్గు, జ్వరం, శరీరం మీద దద్దుర్లు, బొబ్బలు రావటం, ఒంటి రంగు పాలిపోవటం, జడుసుకోవటం వంటివి డెల్టా ప్లస్ లక్షణాలు అని కొత్త స్టడీ చెబుతోంది. శ్వాస సంబంధ ఇబ్బంది, స్పష్టంగా మాట్లాడలేకపోవటం, కడుపు, కీళ్ల నొప్పి, వినికిడి శక్తిని కోల్పోవటం వంటివి కూడా ఇందులో కనిపిస్తాయి. ఇతరత్రా కొన్ని సమస్యలు సైతం బాధిస్తాయి.

ఎక్కడెక్కడ?.. ఎన్నెన్ని కేసులు?.. : Delta Plus

డెల్టా ప్లస్ పాజిటివ్ కేసులను ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో 200లకు పైగా గుర్తించారు. అవి.. ఇండియా, బ్రిటన్, పోర్చుగల్, జపాన్, నేపాల్, చైనా, రష్యా, స్విట్జర్లాండ్, పోలండ్. మన దేశంలో రోజుకొక రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తమ్మీద 12 రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. తమిళనాడులో ఒక వ్యక్తి ఇప్పటికే చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆనందం.. ఆందోళన..

కరోనా సెకండ్ వేవ్ కి ఎండ్ కార్డు పడుతోందనుకుంటున్న తరుణంలో థర్డ్ వెవ్ కి తెర లేవబోతోందని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వం ఈమధ్యే ఆమోదం తెలిపిన మోనో క్లోనల్ యాంటీ బాడీ కాక్ టెయిల్ ట్రీట్మెంట్ ఈ డెల్టా ప్లస్ ని నిలువరించలేకపోతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న వ్యాక్సినేషన్ డెల్టా ప్లస్ బారి నుంచి 88 శాతం వరకు రక్షణ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. డెల్టా ప్లస్ కేసుల సంఖ్య ప్రస్తుతానికి చాలా తక్కువ సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయి కాబట్టి దీన్నే థర్డ్ వేవ్ గా పరిగణించాల్సిన అవసరంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కొవిడ్ అనేది మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తోందనటంలో ఎలాంటి సందేహం లేదు. సిరీస్ మాదిరిగా వెలుగు చూస్తున్న కరోనా సూక్ష్మజీవి ఉత్పరివర్తనాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడో?..

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది