Diabetes : డయాబెటిస్ రోగులు నిద్రపోయే ముందు ఇలా చేయాలి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డయాబెటిస్ రోగులు నిద్రపోయే ముందు ఇలా చేయాలి..

 Authored By mallesh | The Telugu News | Updated on :11 February 2022,6:30 pm

Diabetes : ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇది వ్యాధి ఒక్క సారి వచ్చిందంటే ఇక జీవితకాలం మందులు వాడకతప్పదు. ఇలాంటి వారికి బ్లడ్ లోని షుగర్ అందుపులో ఉండాలి. అందుకే ఈ వ్యాధి సోకిన వారు మందులు వాడుతూ వ్యాయామం సైతం చేయాలి. ఇక వీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి. వీరికి తరచు ఆకలి, దాహం, టాయిలెట్ రావడం వల్ల నిద్రకు చాలా వరకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి.

మరి ఇలాంటి వారు నిద్రపోయే మందు కొన్ని పనులు చేయాలి దాని వల్ల షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.రాత్రి సమయంలో నిద్రపోయే ముందు ప్రతి రోజూ బ్లడ్ లోని షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ లోని షుగర్ పై ఎప్పటికీ నిఘా ఉంచడం డయాబెటిస్ పేషెంట్ల దిన్యచర్యలో భాగం. నిద్రపోయే ముందు షుగర్ లెవల్ ను చెక్ చేసుకోవాలి. మీరు వాడుతున్న మందులు, తీసుకునే చికిత్సలతో బ్లడ్ లో షుగర్ లెవల్స్ నియంత్రణ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్‌కు ఇది చాలా సహాయపడుతుంది.

diabetics should do this before going to bed

diabetics should do this before going to bed

Diabetes : ఇలా చేస్తే ప్రయోజనం

నిద్రపోయే టైంలో షుగర్ ప్రతి డెసిలీటర్ కు 90 నుంచి 150 మిల్లీగ్రాముల మధ్యలో ఉండాలి. ఇలాంటి వారికి సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య షుగర్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. నిద్రపోయే ముందు ఏదైనా ఔషధం తీసుకోవడం, కార్పోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత నిద్రపోయవడం వంటి కారణాలు చాలా ఉంటాయి. నిద్రపోయే ముందు అధికంగా ఫైబర్, తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే సమయానికి ముందు కొద్ది పరిమాణంలో భోజనం చేయాలి. కెఫెన్ కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది