Diabetes : డయాబెటిస్ ఉన్న వారూ.. ఈ చిట్కాలతో స్వీట్స్ తినడం తగ్గించుకోవచ్చు..
Diabetes : జనరల్‌గా ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం రోజున చాలా మంది రకరకాల పనులు చేయాలని అనుకుంటుంటారు. ఏడాది పాటు ఎలా ఉండాలో నిర్ణయించేసుకుంటారు. తమకున్న అలవాట్లో చెడు వాటిని దూరం చేసుకుని, మంచి వాటిని దగ్గర చేసుకోవాలని అనుకుంటుంటారు. అలా తీర్మానించుకునే వాటిల్లో స్వీట్ తినకుండా ఉండాలని నిర్ణయించుకునే వారు చాలా మందే ఉంటారు.ఎందుకంటే తీపి పదార్థాలను తీసుకుంటే కనుక శరీరంలో బరువు బాగా పెరిగిపోయి రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని అనుకుంటుంటారు. ఇక మధుమేహం వ్యాధి ఉన్న వారు అయితే తీపి తినడం చాలా తగ్గించాలని అనుకుంటారు.
కానీ, వారికి ఆ కోరిక అస్సలు తగ్గదు. ఈ క్రమంలో వారికి తీపి పదార్థాల తినే కోరిక తగ్గించుకునేందుకుగాను ఏం చేయాలో తెలుసుకుందాం.చక్కెర లేదా బెల్లం లేదా ఇతర స్వీట్ పదార్థాలను తినాలి అనిపించినప్పటికీ వాటిని ఎలా తగ్గించుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ వ్యాధి ఉన్న వారికి తీపి పదార్థాలు తినాలనిపిస్తుండటం సహజం. కానీ, కంట్రోల్ చేసుకోవాలి. ఇకపోతే అలా నియంత్రణ కోసం ఏం చేయాలంటే.. స్వీట్లు తినాలనిపించినపుడు స్వీట్‌కు బదులు నీరు తాగడం మంచిది. అలా నీరు తాగడం వలన కడుపు నిండుతుంది. అలా చేస్తే ఇక స్వీట్లు తినాల్సిన అవసరం లేదు.
Diabetes : నియంత్రణ అవసరం.. లేదంటే అంతే సంగతులు..
మధుమేహం ఉన్న వారితో పాటు ఇతరులు డైటింగ్ సమయంలో పండ్లు అస్సలు తీసుకోవద్దు. అలా చేయడం వలన మీకే ఇబ్బందులు వస్తాయి. ఒత్తిళ్లు కూడా తగ్గించుకోవాలి. ఒత్తిడి వలన కూడా స్వీట్ తినాలనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పుష్కలంగా నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం. నిద్ర సరిగా పోకపోతే తీపి తినాలనిపిస్తుంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ప్రతీ రోజు 6 నుంచి 8 గంటల పాటు కంపల్సరీగా నిద్రపోవాలి. తగినంత నిద్రపోవడం వలన చాలా ప్రయోజనాలుంటాయి.