Health Benefits : యాంటీ సెప్టిక్ గా పనిచేసే ఈ పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : యాంటీ సెప్టిక్ గా పనిచేసే ఈ పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…!!

Health Benefits : కోకుమ్ పండు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. దీనిని ఆయుర్వేదంలో ఉపయోగించే పండ్లలో ఇది కూడా ఒకటి. కోకుమ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కూల్ మరియు మంచి సువాసన కలిగిన ఈ పండులో పుష్కలమైన పోషకాల నిధిగా పిలుస్తారు. ఈ పండు నుండి తీసిన జ్యూస్ ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్ తో కూడి ఉన్నది. దీనిని గార్సినియా ఇండికా అని కూడా అంటారు. ఈ ఎరుపు రంగు మరియు […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2024,8:00 am

Health Benefits : కోకుమ్ పండు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. దీనిని ఆయుర్వేదంలో ఉపయోగించే పండ్లలో ఇది కూడా ఒకటి. కోకుమ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కూల్ మరియు మంచి సువాసన కలిగిన ఈ పండులో పుష్కలమైన పోషకాల నిధిగా పిలుస్తారు. ఈ పండు నుండి తీసిన జ్యూస్ ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్ తో కూడి ఉన్నది. దీనిని గార్సినియా ఇండికా అని కూడా అంటారు. ఈ ఎరుపు రంగు మరియు పుల్లని పండు రసం శరీరానికి ఎంతో రిఫ్రెస్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. ఈ పండును మామూలు పండులా అనుకోకండి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక దీనిలో యాంటీ సెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. ఈ పండ్ల రసాన్ని రెగ్యులర్ గా తాగటం వలన శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి…

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : మీరు గనక ప్రతిరోజు అనారోగ్యంతో బాధపడుతుంటే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే గోకం పండు తినండి. ఎందుకు అంటే. ఈ పండులో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది…

డయేరియా సమస్య : మీకు డయేరియా సమస్య ఉన్నట్లయితే కోకుమ్ తినటం చాలా మంచిది. ఎందుకు అంటే. దీనిలో యాంటీ డయే రియా గుణాలు ఎక్కువగా ఉన్నాయి. డయేరియా తో బాధపడే వారికి కోకుమ్ పండు రసం ఒక వరం లాంటిది…

బరువు తగ్గటం లో సహాయపడుతుంది : కోకుమ్ జీవక్రియను పెంచుతుంది. ఈ కోకుమ్ పండులో క్యాలరీలు చాలా తక్కువ. కావున దీనిని తినటం వలన సులభంగా బరువు తగ్గుతారు. అయితే ఈ జీరో క్యాలరీ ద్రవంతో పాటు మనకు కొన్నిసార్లు మరింత పోషకాలు అవసరం అవుతాయి…

బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది : కోకుమ్ పండ్ల రసం రక్తంలో చక్కర స్థాయిని సాధారణంగా ఉంచుతుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండుతో చేసిన జూస్ లు తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది…

గుండె ఆరోగ్యానికి : కోకుమ్ పండు తీసుకోవటం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. నిజానికి. ఈ పండులో విటమిన్లు పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి…

చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది : ఎంతో ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగిన వృద్ధాప్య లక్షణాలను తగ్గించే చికిత్సలో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మరమ్మత్తు మరియు నయం చేయటమే కాక చర్మ నష్టాన్ని ఎదుర్కోవటానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…

ఋతుస్రావంలో సహాయపడుతుంది : కొకుమ్ ఋతు చక్రాన్ని తగ్గించటంలో సహాయం చేస్తుంది.సంక్లిష్టమైన ఋతుక్రమ పరిస్థితులను సులభం చేస్తుంది. అయితే గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు ఇది అంతా మంచిది కాదు. అలాగే ముఖ్యమైన చర్మ అలర్జీలు ఉన్న వ్యక్తులు దానిని తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించటం చాలా అవసరం…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది