Cholesterol : ఈ చెడు అలవాట్లే శరీరంలో కొలెస్ట్రాల్ ని పెంచుతాయి తెలుసా… వెంటనే మానేయండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cholesterol : ఈ చెడు అలవాట్లే శరీరంలో కొలెస్ట్రాల్ ని పెంచుతాయి తెలుసా… వెంటనే మానేయండి…!!

Cholesterol : మన రోజువారి జీవితంలో ఎన్నో ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. అయితే నోటికి ఎంతో రుచికరమైన ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో కీడు తీస్తుంది. ముఖ్యంగా వేయించిన ఆహారం తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. దీనివలన చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ బారిన పడే వారి సంఖ్య ప్రతిరోజుకి పెరిగిపోతుంది. అయితే నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం చూస్తే, మన భారతదేశంలో 52 శాతం మంది […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2024,6:00 pm

Cholesterol : మన రోజువారి జీవితంలో ఎన్నో ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. అయితే నోటికి ఎంతో రుచికరమైన ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో కీడు తీస్తుంది. ముఖ్యంగా వేయించిన ఆహారం తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. దీనివలన చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ బారిన పడే వారి సంఖ్య ప్రతిరోజుకి పెరిగిపోతుంది. అయితే నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం చూస్తే, మన భారతదేశంలో 52 శాతం మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో లేకపోతే ఎంతో ప్రమాదం తలపెడుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వీటితో పాటుగా కొన్ని రోజువారి అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని చెడు అలవాట్ల వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఈ అధిక కొలెస్ట్రాల్ అనేది ఊబకాయాన్నికి కూడా దారితీస్తుంది. దీంతో కిడ్నీ సమస్యలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ కొలెస్ట్రాల్ ను కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈరోజే ఈ అలవాట్లను మానుకోండి… మీరు నైట్ టైం లో ఫుడ్ ను చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్య రాత్రి డిన్నర్ చేయాలి అని వైద్యులు చెబుతున్నారు. మీ ఆహారంలో సూప్ మరియు సలాడ్ లాంటి తేలికైన పదార్థాలను తీసుకోవడం మంచిది అని అంటున్నారు. అంతేకాక మీరు అన్నం మరియు చపాతీలను తీసుకున్న అవి కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి అని అంటున్నారు. అలాగే మీరు రాత్రి టైం లో చాలా తక్కువ ప్రోటీన్లు తీసుకోవాలి. అంతేకాక చేపలు లేక మాంసం తీసుకోవడానికి బదులుగా చాలా తక్కువ మసాలా మరియు నూనెతో వండిన ఆహారాలను తీసుకోవాలి. అలాగే రాత్రి టైంలో అతిగా ఆహారం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు మొదలవుతాయి…

అయితే రాత్రిపూట పని చేసేవారు చాలామంది పనిచేసేటప్పుడు నిద్రపోకుండా ఉండటానికి చాక్లెట్ లేక కాఫీని అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు కొలెస్ట్రాల్ ను తగ్గించాలి అనుకుంటే ఈ అలవాటును వెంటనే మానేయాలి. అయితే మిడ్ నైట్ క్రెవింగ్స్ అనే పదం గురించి ప్రతిరోజు రాత్రిళ్లు నిద్రలేచే వారికి బాగా సుపరిచితమే. అయితే ఇలా ఎంతోమంది రాత్రి టైంలో బర్గర్లు, పిజ్జా, సలామీ లేక ఇతర రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. అయితే మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్లయితే రాత్రి టైం లో ఈ ఆహారాలను తీసుకోవడం మానేయండి. ప్రస్తుతం మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ ను తీసుకోవడం మానేయండి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది