Green Chilli Water : పచ్చి మిరపకాయలతో ఇలా చేసిన నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Chilli Water : పచ్చి మిరపకాయలతో ఇలా చేసిన నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2024,7:00 am

Green Chilli Water : ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అందుకే చాలా మంది రకరకాల ఆరోగ్య నియమాలను పాటిస్తుంటారు. అన్నిటికన్నా మన వంటింట్లో ఉండే వాటితోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చకు. మన కిచెన్ లో ఉండే వాటిలో పచ్చి మిరపకాయలు అదేనండి పచ్చిమిర్చి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. పచ్చి మిర్చిలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక పోవచ్చు. కానీ పచ్చి మిర్చిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. పచ్చి మిర్చితో తయారు చేసిన నీటిని తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.

Green Chilli Water : ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..

పచ్చి మిరపకాయలను నీటిలో నానబెట్టి తాగితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది బాడీని ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు, ఇతర వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతుంది. ఇందులో బీటా కెరోటిన్‌ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మీరు మీ బాడీలోకి వచ్చే చెడు బ్యాక్టీరియా నుంచి ఎక్కువగా కాపాడుకోవచ్చు. ఇక్కడ మరో గొప్ప ఉపయోగం ఏంటంటే పచ్చి మిర్చినీటితో షుగర్ లెవల్స్ బాగా కంట్రోల్ అవుతుంటాయి. పచ్చిమిర్చి నీరు తాగడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది. దాంతో పాటు బరువును కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీని వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. పచ్చి మిర్చి నీరు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది బాడీలోని కొలెస్ట్రాల్ ను బాగా తగ్గించేస్తుంది.

Green Chilli Water పచ్చి మిరపకాయలతో ఇలా చేసిన నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా

Green Chilli Water : పచ్చి మిరపకాయలతో ఇలా చేసిన నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

ఈ నీరు బాడీలోని కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. ఇంకో ఉపయోగం ఏంటంటే మీ చర్మం ఎంతో ఆరోగ్యంగా మెరుస్తుంది. మిరపకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నిత్యం మెరిసేలా చేస్తాయి. అయితే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవలంటే పడుకునే ముందు 3-4 పచ్చి మిరపకాయలను బాగా కడుక్కుని మధ్యలో చీలిక పెట్టుకోవాలి. తర్వాత ఈ మిరపకాయలను గ్లాసు నిండా నీల్లు పోసుకుని వాటిలో నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే తాగితే సరిపోతుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది