Winter Skin Care Tips : శీతాకాలంలో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఇవి తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Winter Skin Care Tips : శీతాకాలంలో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఇవి తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 December 2022,7:40 am

Winter Skin Care Tips : చాలామంది శీతాకాలంలో ఎన్నో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ వ్యాధుల వైద్యనిపుణులు మాత్రం పోషకాహారం అధిక నీటిని వాడడంతో శీతాకాలం చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు అని తెలియజేస్తున్నారు. వీటితోపాటు ఈ కాలంలో దొరికే అద్భుత ఆహారాల వలన కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. శీతకాలం వచ్చిందంటే చాలు చాలామంది చర్మ సమస్యలు ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఈ కాలంలో సున్నిత చర్మంపై పగుళ్లు వచ్చి బాగా నొప్పి కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా చర్మం కూడా పొడిబారి పోతూ ఉంటుంది. అలాగే ఈ కాలంలో వచ్చే ఇతర ఇబ్బందులు వల్ల కూడా మన చర్మం చూడడానికి అంతగా బాగోదు.

అయితే ఇటువంటి సమయంలో అందంగా ఉండడానికి మార్చురైజర్లను వాడుతూ ఉంటారు. అవి కూడా కొంతసేపు మెరుగనిస్తూ ఉంటాయి. శాశ్వతంగా పనిచేయవు. అయితే ఈ చర్మ స్పెషలిస్టులు చెప్పే కొన్ని గొప్ప ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. కమల, నారింజ : ఇవి శీతాకాలంలో మాత్రమే దొరికే అద్భుత పండ్లు దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జామ : జామకాయలు విటమిన్లు ఏ,సీ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా బీటా కెరో టీన్ లైకోపీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి చర్మ రక్షణకు ఉపయోగపడే కొల్లాజిన్ ను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి. జామకాయల్ని తీసుకోవడం వల్ల వృద్ధాప్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

Do you suffer from skin problems in winter

Do you suffer from skin problems in winter

బచ్చలి కూర : బచ్చల కూరలో ఉన్న ఎన్నో రకాలైన విటమిన్లు చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ,సి చర్మ రక్షణకు చాలా ప్రధానమని నిపుణులు తేలుపుతున్నారు. దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాని డీహైడ్రేషన్ వైరల్ ప్రభావాలు లేకుండా చేస్తాయి. ముఖ్యంగా బచ్చల కూర తింటే వయసు రిత్యా వచ్చే చర్మం ముడతలు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

దానిమ్మ పండ్లు : దానిమ్మ చర్మంపై యాంటీ మైక్రోబియల్ ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రధానంగా ముఖంపై వచ్చే మొటిమలు తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం లో ఆయిల్ లెవెల్స్ ను మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి.

క్యారెట్లు : క్యారెట్ అంటే శీతాకాలంలో దొరికే గొప్ప ఆహారం శీతాకాలంలో క్యారెట్ను తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
టాక్సీలను బయటకు పంపడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని బలోపేతం చేయడంతో పాటు చర్మాన్ని గ్లోయింగ్ కూడా కనిపించేలా చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది