TEA : ఈ ఫుడ్ ని టీ తో తీసుకుంటున్నారా…? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TEA : ఈ ఫుడ్ ని టీ తో తీసుకుంటున్నారా…? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 January 2023,7:00 am

TEA : మనం ఉదయం లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే ఆ టీతోపాటు కొన్ని పదార్థాలు తింటూ ఉంటాం. అయితే కొన్ని పదార్థాన్ని టీ తో తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. ఎందుకనగా కొన్ని ఆహార పదార్థాలను టీ ను కలిపి తీసుకోవడం వలన జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు.. దీని అందరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజువారి దినచర్యలో ఇదొక భాగం అనుకుంటూ ఉంటారు. టిఫిన్ చేసిన తర్వాత టి అనేది తాగుతూ ఉంటారు. అదేవిధంగా మధ్యాహ్నం తినే సమయంలో కూడా టీ ని తప్పకుండా తాగుతారు. అయితే సమోసా, పకోడీ స్నాక్స్ తో టీ తీసుకోవడం అనేది కామన్ చర్య నే.. అయితే ఈ ఆహార పదార్థాన్ని టీ తో పాటు అసలు తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే పోషకాలను శరీరం కోల్పోవాల్సి వస్తుందని చెప్తున్నారు. టీతో తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది.

అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. టీతో పాటు తీసుకోకూడని ఐదు ఆహార పదార్థాలు : పెరుగు : ఈ పెరుగు అనేది చల్లటి ఆహార పదార్థానికి ఓ చక్కటి ఉదాహరణ టీ, కాఫీ, బాదం, జీడిపప్పులు ఇలాంటి వాటితో పెరుగును కలిపి తీసుకుంటే శరీరానికి చాలా ప్రమాదకరం కావున టీతో పెరుగును కలిపి అసలు తీసుకోవద్దు.. నిమ్మరసం : నిమ్మరసాన్ని తప్పకుండా లెమన్ టీ లో కానీ బ్లాక్ టీ లో కానీ ఖచ్చితంగా కలుపుతూ ఉంటారు. దీన్ని బరువు తగ్గించే ఔషధంగా చెప్తారు. అయితే వైద్యనిపుణులు మాత్రం వేడి నీటితో నిమ్మరసాన్ని కలపడంతో ఆసిడ్స్ లెవెల్స్ ను పెరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున వేడి నీటితో నిమ్మరసం కలిపి తీసుకోవద్దు.. పసుపు : భారతీయ వంటకాలలో కచ్చితంగా పసుపుని వాడుతుంటారు. ఛాయి లేదా పాలలో పసుపును వేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని చెప్తున్నారు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది.

Do you take this food with tea

Do you take this food with tea

అలాగే టీ టానిక్ ఉంటుంది. ఈ రెండిటిని కలవడం వలన అమలత్వం, మలబద్దకం లాంటి గ్యాస్టిక్ సమస్యలు వస్తుంటాయి.. గ్రీన్ వెజిటేబుల్స్ : ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు టీతో అసలు తీసుకోకూడదు. ఎందుకనగా టీలో టానిన్లు ఆక్సిలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శోషన్ను నిరోధిస్తాయి. కావున శరీరంలో ఐరన్ ను షోషించాలి. అంటే ఆకుపచ్చ, కూరగాయలతో టీ ని తీసుకోవడం మానుకోవాలి. ఫ్రూట్ సలాడ్స్ : చాయ్ వేడిగా ఉంటుంది. దాన్ని తినే సమయంలో శరీరంలో అన్నవాహిక అన్ని వేడి పరుస్తూ ఉంటాయి. ఇది సమయంలో చల్లని పచ్చి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. పల్లెలో అధిక పోషకాలు ఉంటాయి. వీటితోపాటు టీ లేదా కాఫీ తీసుకుంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. తాజా పండ్లు ఫ్రూట్ సలాడును తినే టైంలో కచ్చితంగా టీ నీ అవాయిట్ చేయాలని చెబుతున్నారు..

Advertisement
WhatsApp Group Join Now

Tags :

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది