Non Veg : మాంసం తింటే ఇన్ని సమస్యలా.. వాటి గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!
ప్రధానాంశాలు:
Non Veg : మాంసం తింటే ఇన్ని సమస్యలా.. వాటి గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!
Non Veg : ఆదిమానవుల నుంచి ఇప్పటి వరకూ ఎంతో మందికి ప్రియమైన ఆహారంగా నిలిచింది. “ముక్క లేకుండా ముద్ద దిగదు” అనుకునే వారు మన చుట్టూ చాలామంది ఉంటారు. కొంతమంది మాత్రం నిత్యం మాంసం తింటూ, దీని వల్ల కలిగే దుష్ఫలితాలను మనస్పూర్తిగా గుర్తించలేకపోతున్నారు. ఈ తరహా ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయగలవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Non Veg : మాంసం తింటే ఇన్ని సమస్యలా.. వాటి గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!
Non Veg : ఇలా చేయండి..
మాంసాహారం వలన వచ్చే సమస్యలు ఏంటంటే.. ఎర్ర మాంసం (Red Meat) మరియు ప్రాసెస్ చేసిన మాంసంలో అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్ర గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. తరచూ మాంసం తినే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
మాంసాహారం అధికంగా తినడం వల్ల శరీరంలో అవసరానికి మించి క్యాలరీలు చేరుతాయి. ఫలితంగా బరువు పెరుగుతుంది. ఇది ఒక్క బరువు మాత్రమే కాదు, ఆర్థరైటిస్, గుండెజబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మాంసంలో ఉండే ప్రోటీన్‌ను జీర్ణించడానికి కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఇది తరచూ జరుగుతూ ఉండటం వల్ల కిడ్నీల పనితీరు మందగించడంతో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి మాంసం తిన్న తర్వాత చర్మం దద్దుర్లు, దురద, శ్వాస సంబంధిత సమస్యలు మొదలయ్యే అవకాశముంది. అంతేకాదు, రెడ్ మీట్‌లో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ గౌట్ (గింజల నొప్పులు), కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. వారానికి 1–2 సార్లు మాత్రమే తినడం, ప్రాసెస్ చేసిన మాంసం నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే, ఆరోగ్యకరమైన శాకాహారాన్ని ఆహారంలో భాగం చేయడం ద్వారా శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయి.