Almonds : బాదంపప్పు తిన్నప్పుడు ఈ ఒక్క తప్పు చేయకండి… మీ ప్రాణాలకే ప్రమాదం
Almonds : మీకు తెలుసా మన ఒంట్లో ఎన్ని రకాల బ్యాక్టీరియాలో వైరస్లు ఉంటాయో.. బయట నుంచి కూడా మన ఒంటి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉండే వైరస్లు చాలా ఉంటాయి. ఇవి మన కంటికి కనపడవు.. వీటిని అరికట్టాలంటే మందులు వాడితే సరిపోదు మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అందులోనూ ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం సరైన మార్గం. మరి ఆ డ్రై ఫ్రూట్స్లో ముఖ్యమైన బాదంపప్పు దాన్ని ఎలా తినాలి? ఎప్పుడు తినాలి.. ఎవరు తినాలి.. ఇలాంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అయితే కరోనా మహమ్మారి వచ్చిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై అవగాహన పెంచుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ కూడా డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఎన్ని రకాల ఔషధాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు..
బాదంపప్పులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి.వీటిని ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు ఒక రోజులో ఈ బాదం పప్పును ఎప్పుడైనా తినొచ్చు. అసలు బాదంపప్పు ఎలా తినాలి.. అందులో మన శరీరానికి కావలసినవి ఏమున్నాయి.. ఎన్ని క్యాలరీలు మన శరీరానికి అందుతాయి.. అనే వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.. వీటిని రోజు తినడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది చాలా రోగాలతో బాధపడుతున్నారు. కనీసం చాలామంది దీని ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటారు.. అయితే వీటిని ఎలా తీసుకోవాలో తెలుసా.. మీరు వీటిని ఒక రాత్రంతా బాదం పప్పుని నీటిలో నానబెట్టండి.
కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు దీని పైన ఉన్న పొరను తీసి బాదంపప్పు తినేయాలి. చాలామంది అంటారు బాదం తొక్కులో చాలా పోషకాలు ఉంటాయి అని కానీ అది నిజం కాదు.. ఈ తొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉండవు.. ఈ తోక్క వలన గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలామందికి ఇది తెలియక తప్పు చేస్తున్నారు.. కాబట్టి మేము చెప్పినట్టుగా తొక్కు తీసేసి తినడం స్టార్ట్ చేయండి.. ఇక ఇప్పుడు అసలు ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది.. అన్న విషయం గురించి తెలుసుకుందాం.. అని మీకు తెలుసా.. ఒక అమెరికన్ పరిశోధన ప్రకారం మీరు ఒకేసారి 20 బాదం పప్పులు హాయిగా తినొచ్చు..
కానీ కొంతమందికి దీనివల్ల గ్యాస్ ట్రబుల్ రావచ్చు.. విటమిన్ ఈ ఓవర్ డోస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రోజులో ఒక పది బాదం పప్పులు తినండి. ఎలాంటి సమస్యలు ఉండవు.. మీకు అందవలసిన విటమిన్లు ఖనిజాలు పోషకాలు అన్ని అందుతాయి.. రోజు బాదంపప్పుని తినండి అది కూడా పైన ఉన్న తొక్క తీసి తినండి ఆరోగ్యంగా ఉండండి..