Cooking Oils : వంటకాలలో ఈ నూనెను వినియోగిస్తే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే… తస్మాత్ జాగ్రత్త…!
ప్రధానాంశాలు:
Cooking Oils : వంటకాలలో ఈ నూనెను వినియోగిస్తే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే... తస్మాత్ జాగ్రత్త...!
Cooking Oils : మీ ఇంట్లో వంట తయారీకి ఈ నూనెను వినియోగిస్తున్నారా…అయితే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే. తాజాగా అమెరికా ప్రభుత్వం చేసిన ఓ అధ్యయనం ప్రకారం వంట నూనె క్యాన్సర్ కు కారణం అవుతుందని తెలిసింది. దీని కారణంగా ఎక్కువ శాతం యువత క్యాన్సర్ కు గురవుతున్నారని తెలిపారు. మరి ముఖ్యంగా పొద్దుతిరుగుడు ,ద్రాక్ష విత్తనాలు కనోల మరియు మొక్కజొన్న వంటి విత్తనాల నుండి తయారైన నూనెలను ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని గట్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం పేర్కొనడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో తినదగిన నూనెను ఖచ్చితంగా ఎంచుకోవాలని చెబుతున్నారు.
Cooking Oils సీడ్ ఆయిల్ ప్రమాదకరం…
తాజాగా అమెరికాలో నిర్వహించిన ఈ అధ్యయనంలో బయోయాక్టివ్ లిపీడ్లు అధికంగా ఉన్న 80 మంది పెద్దప్రేగు క్యాన్సర్ రోగులపై పరిశోధనలు చేశారు. అయితే వీరిలో ఎక్కువ శాతం విత్తన నూనెలు విచ్చనం కావడం వలన వారిలో బయోయాక్టివ్ లిపీడ్లు పెరుగుతున్నాయని గుర్తించడం జరిగింది. అంతేకాక మునుపటి పరిశోధనలో కూడా ఆరోగ్యం పై సీడ్స్ ఆయిల్ అనేక రకాల హానికరమైన ప్రభావాలను చూపుతున్నట్లుగా తెలిసింది. ఇవి శరీరంలో క్యాన్సర్ కు కారణం అవుతాయి.
Cooking Oils ఎందుకు ప్రమాదం …
దాదాపు 1900 సంవత్సరంలో కొవ్వొత్తుల తయారు చేసేవారు విలియం ట్రాక్టర్ సభ్యులు జంతువుల కొవ్వును భర్తీ చేసేందుకు విత్తనాలు నూనెను ఎక్కువగా ఉపయోగించేవారు. అదే సమయంలో అమెరికన్లు దీనిని ఆహారంలో భాగంగా చేర్చుకున్నారు. అయితే దీనిలో ఒమేగా 6 పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ నూనె ఎక్కువగా తీసుకోవడం వల్లన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వంటకు ఏ నూనె వాడాలి : మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అనుకుంటే మీ ఆహారంలో ఆలివ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వంటి తేలికపాటి నూనెలను వినియోగించడం మంచిది. అన్నింటిలో ఆలివ్ నూనె వంట కోసం గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. దీంతోపాటు వేరుశెనగ నువ్వుల నూనె కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు.