Herbal Tea : రోజు ఈ హెర్బల్ టీని తాగండి.. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి…!
Herbal Tea : మనకు ఉదయం నిద్ర లేవగానే వేడివేడి టీ తాగడం అలవాటు.. టీ తాగడం వల్ల ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి టీ తాగితే ఆ మజానే వేరు..అయితే హెర్బల్ టీ లో యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడుని చురుగ్గా ఉంచడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హెర్బల్ టీ కి సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ ఇవన్నీ టీలలో రకాలు.. ఇంకా ఇవి కాకుండా హెర్బల్ బి అనే టీ కూడా ఉంది. సాధారణ టీలు ఈ ఆకుల నుంచి లభిస్తే.. ఈ హెర్బల్టి మాత్రం పువ్వులు మొక్కలు వాటి ఆకులు, భిన్నమైన పూలు ,ఆకులు మసాలాలు వంటి వాటిని నీటిలో నానబెట్టి తయారుచేస్తారు. సాధారణ టీ లో ఉన్నట్టుగా వీటిలో కెఫీన్ ఉండదు. ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి ఎలా మేలు చేస్తుంది అని అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని రకాల హెర్బల్ టీ లు జీర్ణవ్యవస్థను బాగు చేస్తాయి. అలాగే గ్యాస్, విరోచనాలు, నిద్రలేని ఆందోళన తదితర సమస్యలకు సైతం ఇవి పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
విటమిన్ సి ఉండటం వలన వీటిలో వాపును తగ్గించే ఆంటీ ఇంఫ్లమేటరీ కూడా ఉండే అవకాశం ఉంది అనమాట.. ఇది మన శరీరంలో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా దీన్ని ఒక రిఫ్రిషింగ్ ఏజెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీటిలో మనకి రకరకాల యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీస్ అనేవి లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంటాయి. ఇలాంటి రకరకాల కాంపౌండ్స్ అనేది లభిస్తాయి అన్నమాట.. ముఖ్యంగా ఇవి మన శరీరంలో పుట్టే ఫ్రీ రాడికల్ని అరికట్టడానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట.. ముఖ్యంగా మనకి అల్లం టీ లో సాధారణంగా పాలల్లో వేసి అల్లం ముక్కని మరిగిస్తూ ఉంటాం.. ఈ పాలు పంచదార వేయకుండా అల్లము కాస్త టీ పొడి వేసి మరిగించి తీసుకోవడం వల్ల మనకి అల్లం లో ఉండే జింజర్ సాల్ అనే కాంపోనెంట్ అనేది డైరెక్ట్ గా అబ్సార్బ్ అవుతుంది. అలాగే ఇది నొప్పులని తగ్గిస్తుంది. ఇది కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణ సమస్యలను తలనొప్పుల్ని శ్వాస సమస్యల్ని తగ్గిస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. కీళ్ల నొప్పులు జలుబును తగ్గిస్తుంది. కొన్ని రకాల హెర్బల్ టీ లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అయితే ఇలాంటి వాటిని దీర్ఘకాలం పాటు వాడకూడదు. మరికొన్ని రకాల హెర్బల్ టీలు లివర్ గాల్బ్లాడర్లలో సమస్యలను సైతం తగ్గిస్తాయి. మందార జాతికి చెందిన పూలతో తయారు చేసుకున్న టీ మన ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయిని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కొలెస్ట్రాల సైతం తగ్గించే అవకాశం ఉంది. అయితే తగిన మోతాదులు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందని మర్చిపోకూడదు. పసుపుతో తయారు చేసిన హెబల్ టీ తాగటం వలన గ్యాస్, కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు అంటున్నారు. పసుపు క్యాన్సర్ పై కూడా పోరాడుతుంది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.
అలాగే రక్తాన్ని పలుచన చేసే మందులతో పాటు మరికొన్ని మందులపైన ఇవి ప్రభావాన్ని చూపుతాయని తెలుస్తోంది. అందుకే ఏవైనా ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా మీదకి తాగడం మంచిది. సాధారణంగా ఇవి సురక్షితమైనప్పటికీ కొన్ని మాత్రం అలర్జీలతో పాటు పొట్టకు సంబంధించిన సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ఈ హెర్బల్ టీ లలో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ వీటిని ఎక్కువ కాలం పాటు ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచే మాట వాస్తవమే.. కానీ వీటిని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.