Cumin Water : ఉదయాన్నే జీలకర్ర వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!
Cumin Water : జీలకర్ర ఆహారానికి సువాసనతో పాటు రుచిని తీసుకొస్తుంది. జీలకర్రలో అద్భుతమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీలకర్ర వలన కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. జిలకర రక్తంలోని చక్కెర నిల్వలని క్రమబద్ధీకరిస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి గుండెకు రక్త సరఫరా సాఫీగా అందేలా సహాయపడుతుంది. జిలకర మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. కడుపులో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది. జీవ క్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కడుపులో ఉండే పరాన జీవులను నివారిస్తుంది. శరీరంలో ఏర్పడే అనారోగ్యాలను తొలగిస్తుంది. జలుబు, దగ్గులను తగ్గిస్తుంది. మరియు గ్యాస్ సమస్యలను తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుం.ది బరువు తగ్గేందుకు కూడా జీలకర్ర బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
మరి బరువు తగ్గేందుకు జీలకర్ర ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాం.. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి రెండు ఫుల్ గ్లాసుల వాటర్ ని వేసుకోండి. ఇందులో రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని జీలకర్రను మరిగించుకోండి. జీలకర్ర ఈ విధంగా మరుగుతూ ఉండగా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పది నుంచి 15 నిమిషాల పాటు ఈ జీలకర్ర వాటర్ ని మరిగించండి. జీలకర్ర వాటర్ తీసుకోవడం వలన కడుపులో వికారం ఇంకా కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా సమస్య కూడా తగ్గుతుంది. ఇతర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మొలల వ్యాధి నుండి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ ని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్ లోకి ఇలా వడకట్టుకోండి. ఈ విధంగా వడకట్టిన నీటిని ప్రతిరోజు ఉదయం పూట త్రాగడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో ఏర్పడే రాళ్లు సైతం కరుగుతాయని కూడా ఆయుర్వేదం చెబుతోంది. శరీరంలో హానికరమైన టాక్సీలను బయటకు పంపుతుంది.
ప్రేగులో ఏర్పడే వ్యర్థాలను తొలగిస్తుంది. ఇలా తయారు చేసుకున్న గోరువెచ్చని జీలకర్ర వాటర్ ని ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే అధిక బరువు కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది…