Milk : పాలు ఆ సమయంలో తాగితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు…!!
Milk : చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాగే పిల్లలకైతే నిత్యం పాలు ఇస్తూనే ఉంటారు. ఉదయాన్నే పరగడుపున పాలు తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు, మలబద్ధకం వస్తాయట. అలాంటి సమయంలో జీర్ణక్రియ సమస్యలు ఉన్నవాళ్లు ఏదైనా తిన్న తర్వాత మాత్రమే పాలు తాగాలి. లేదంటే ఆరోగ్యం ప్రమాదంలో పడిట్లే.. పాలను సంపూర్ణ ఆహారం అని చెబుతారు. పాలు శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. క్యాల్షియం పుష్కలంగా ఉండడం వలన ఎముకలు కు చాలా బాగా సహాయపడతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ పాలు తాగుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల శారీరక మానసిక అభివృద్ధిలో పాలు ముఖ్యమైన పాత్రని వహిస్తాయి. ఇక కొందరు పాలు తాగడంతోనే తమ రోజును మొదలు పెడుతూ ఉంటారు.
చాలామంది పాలు తాగడానికి కూడా ఒక టైం ఉందని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు సరియైన టైంలో ఏదైనా తినకపోతే దాని నుండి ఉపయోగం పొందే బదులు ప్రతికూల ఫలితాలను పొందుతూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం ఏదైనా వాడుకోవడానికి ఒక టైం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య నిపుణుల ప్రకారం ఏ టైం లో నైనా ఖాళీ కడుపుతో పాలు తీసుకోవడం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయాన్నే పరగడుపున పాలు తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు మలబద్ధకం లాంటివి వస్తున్నాయి. జీర్ణ క్రియ సమస్యలు ఉన్నవాళ్లు ఏదైనా తిన్న తర్వాతనే పాలు తీసుకోవాలి. అయితే చిన్న పిల్లలు కూడా ఈ విధంగా తీసుకోవద్దు. రోజుల్లో ఎప్పుడైనా పాలు తాగొచ్చు వృద్దులు మాత్రం ఉదయం పాలు తీసుకోకూడదు..
రాత్రి సమయంలో మాత్రమే : రాత్రి సమయంలో పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే మధ్యాహ్నం భోజనంలో పాలు కూడా తాగవచ్చు. మరోవైపు పాలలో పసుపు కలిపి వాడడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందట.. మలబద్ధకం లేదా గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు రాత్రి సమయంలో మాత్రమే పాలు తాగాలి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు రోజంతా మీ అలసటను దూరం చేస్తుంది. అదేవిధంగా ప్రశాంతంగా నిద్రపోతారు. పెద్దవారు రాత్రి పడుకునే సమయంలో గంట ముందు పాలు తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దానికి ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు…