Health Problems : ఈ ఫుడ్ తింటే కిడ్నీలకు ప్రమాదం.. అవేంటో తెలిస్తే షాక్
Health Problems : కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. బాడీలోని టాక్సిన్ అన్నింటిని బయటికి పంపే పనిని నిర్వహిస్తాయి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే విషపదార్థాలు బయటికి పోక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని ఎల్లప్పుడు కాపాడుకోవాలి. కిడ్నీ చెడిపోతే శరీరంలో గుండె సంబంధిత వ్యాధులు కూడా మొదలవుతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంల సహాయపడతాయని భావిస్తారు.కిడ్నీలు సరిగా పనిచేయడం ఆగిపోతే మనిషికి ఆకలి సరిగా వేయదు. అంతేకాకుండా ఊపరితిత్తుల్లో కఫం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి.
కొంతమందికి కాళ్లు, చేతులు, ముఖం తరుచు వాస్తున్నాయంటే వారిలో కిడ్నీ లోపం అని గుర్తించవచ్చు వెన్ను భాగంలో నొప్పి కలుగుతుంది. కిడ్నీలు ఫెయిలైతే వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది.కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ నీరు తాగాలి. అలాగే సోడియం తీసుకోవడం తగ్గించాలి. ఇది కిడ్నీకి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చేపల్లోని ఒమేగా-2 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ ఫ్యాట్స్ అధికంగా లభిస్తాయి. ప్రొటీన్లు పుష్కలంగా లభ్యమయ్యే చేపలు కిడ్నీలను కాపాడతాయి. తాజా పండ్ల రసాలు లేదా కూరగాయ రసాలకు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యం ఉంది. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి కిడ్నీలు విఫలం కాకుండా ఉండేందుకు కూరగాయల జ్యూస్‌లు ఇవ్వడం మంచిది.
Health Problems : ఈ ఫుడ్ తినాలి..
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే బెర్రీలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పళ్లు, కూరగాయలను తినడం ద్వారా లేదా జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలను కాపాడుకోవచ్చు. యాపిల్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు అధికంగా లభిస్తాయి. యాపిల్ పండ్లు కొలెస్ట్రాల్‌ను, మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కిడ్నీలను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఆరోగ్యానికి క్యాప్సికమ్ చాలా మంచిది. ముఖ్యంగా ఎర్ర రంగు క్యాప్సికమ్ కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది.కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వంటి వ్యాధులు ఉన్నట్లయితే, అధిక మొత్తంలో ప్రోటీన్-రిచ్ ఫుడ్స్‌ను తీసుకోకూడదు. ఆల్కహాల్ పూర్తిగా మానేయ్యాలి. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్, హై ప్రొటీన్ డైట్, ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్, హై షుగర్ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడానికి బదులుగా, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు తినండి. బయటి ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు.